![student died in accident - Sakshi](/styles/webp/s3/article_images/2018/01/4/SEVEN.jpg.webp?itok=wbL-b0Ak)
నిజామాబాద్ : నగరంలోని కంఠేశ్వర్ బస్టాప్ వద్ద గురువారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. కదులుతున్న బస్సు ఎక్కే క్రమంలో ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు జారి కింద పడ్డాడు. విద్యార్థిపై నుంచి బస్సు వెనక టైరు వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు మదన్(21) నగరంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో పైనల్ ఇయర్ చదువుతున్నాడు. బస్సు నిజామాబాద్ నుంచి మెట్‌పల్లి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment