
ప్రమాద వార్త కలిచి వేసింది: వైఎస్ జగన్
హైదరాబాద్ : అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వార్త కలచి వేసిందని ఆయన అన్నారు. ప్రమాదంలో పిల్లలు సహా అనేకమంది చనిపోవడం తీవ్ర ఆవేదనకు గురి చేస్తోందన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.
గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కాగా అనంతపురం జిల్లాలో మడకశిర నుంచి పెనుకొండ వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లోయలో పడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో సుమారు 12మంది దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.