
రెండు బైక్‌లు ఢీ.. ఒకరి మృతి
విజయవాడ: విజయవాడ ఎంజీ రోడ్డులో పీవీటీ మాల్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బాబు అనే యువకుడు మృతిచెందగా.. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.