తిరుమల: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో శనివారం మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డులోని ఒకటో మలుపు వద్ద మహారాష్ట్రకు చెందిన టెంపో ట్రావెలర్ పిట్టగోడను ఢీకొన్నది. దీంతో ఆ వాహనంలో వెళ్తున్న 10 మంది భక్తులు గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.