లారీ, కారు ఢీ; ఆరుగురు దుర్మరణం..! | Lorry Car Crash 5 Dead At Gudluru In Prakasam District | Sakshi
Sakshi News home page

లారీ, కారు ఢీ; ఆరుగురు దుర్మరణం..!

Published Fri, Aug 9 2019 4:28 PM | Last Updated on Fri, Aug 9 2019 8:39 PM

Lorry Car Crash 5 Dead At Gudluru In Prakasam District - Sakshi

సాక్షి, ప్రకాశం/కరీంనగర్‌ : జిల్లాలోని గుడ్లూరు మండలం మెచర్ల వద్ద శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుంటుంబానికి చెందిన ఆరురుగు దుర్మరణం పాలయ్యారు. వీరంతా కరీంనగర్‌ జిల్లా వాసులుగా తెలిసింది. దీంతో వారి స్వగ్రామమైన భాగ్యనగర్‌లో విషాదఛాయలు  అలుముకున్నాయి. మృతుల్లో కొంపల్లి లీలా-మలహల్‌రావు దంపతులు, వారి కూతురు అర్చన, అల్లుడు వంశీకృష్ణ ఉన్నారు. అర్చన-వంశీకృష్ణ దంపతుల కుమారులు అద్వైత (7), కృషాణ్‌ (5) కూడా ఈ ‍ప్రమాదంలో కన్నుమూశారు. విజయవాడలో దుర్గమ్మ దర్శనం చేసుకుని తిరుమలకు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్టు తెలిసింది. వంశీకృష్ణ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తుండేవాడని సమాచారం.



No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement