gudluru
-
నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు కార్మికులు మృతి
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుంది. గుడ్లూరు మండలం మోచర్ల వద్ద జాతీయ రహదారి పనుల్లో నిమగ్నమైన కార్మికులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదం ఘటనా స్థలిలోనే ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందగా మృతుల సంఖ్య అయిదుకి చేరింది. మిగతా వ్యక్తిని మెరుగైన చికిత్స కోసం నెల్లూరు అసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన సమయంలో అటుగా వెళ్తున్న రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు ప్రమాదాన్ని గమనించి ఆగిపోయారు. ప్రమాదంపై చలించిపోయిన ఎంపీ క్షతగాత్రులను తరలించే చర్యలు చేపట్టారు. యాక్సిడెంట్ జోన్‌గా ఉన్న మోచెర్ల వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తానని భరోసానిచ్చారు. చదవండి: సిరిసిల్ల యువతి కిడ్నాప్ కేసులో భారీ ట్విస్ట్ -
నిద్రమత్తు ముగ్గురిని మింగేసింది
గుడ్లూరు: ఓ డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ముగ్గురి ఊపిరి ఆగిపోయింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఘటన ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలోని జాతీయ రహదారిపై చేవూరు వద్ద బుధవారం ఉదయం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. తిరుపతిలోని వేదిక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అగ్నిహోత్రి శ్రీనివాసాచార్యులు తన భర్య రాజ్యలక్ష్మితో కలసి ఒంగోలు నగరంలోని అయ్యప్ప స్వామిగుడిలో జరిగే పవిత్రమాస పూజోత్సవాల్లో పాల్గొనేందుకు తెల్లవారుఝామున 5 గంటలకు కారులో ఒంగోలుకు బయలు దేరారు. ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలోని జాతీయ రహదారిపై ఉన్న చేవూరు వద్దకు వచ్చేసరికి కారు అదుపుతప్పి.. తమిళనాడు నుంచి విజయవాడకు వెళ్తున్న రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ లారీని వెనుక వైపు వేగంగా ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలతో శ్రీనివాసాచార్యులు (58), కారు డ్రైవర్ పురుషోత్తమరావు (30) ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. తీవ్రగాయాలైన రాజ్యలక్ష్మి (55)ని 108లో కావలి ఏరియా వైద్యశాలకు తరలించగా అక్కడ మృతి చెందింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. కందుకూరు డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ శ్రీరామ్, ఎస్ఐ మల్లికార్జున ప్రమాద స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. రోడ్ సేఫ్టీ పోలీసులు లారీ కింద ఇరుక్కుపోయిన కారును జేసీబీ ద్వారా బయటకు లాగి మృతదేహాలను తీశారు. జరిగిన దుర్ఘటనపై లారీ డ్రైవర్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. మృతుడు శ్రీనివాసాచార్యులుకు ఇద్దరు కుమారులున్నారు. మృతుడి స్వస్థలం కృష్ణాజిల్లా గుడివాడ మండలం దింటకూరు గ్రామం. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
కూతురికి ఉరేసి.. తానూ ఉరేసుకొని ఆత్మహత్య
సాక్షి, గుడ్లూరు(ప్రకాశం): వ్యసనాలకు బానిసైన భర్త వేధింపులతోనే శ్రీలేఖ తన కుమార్తెకు ఉరేసి తానూ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని ఆమె బంధువు గండికోట రమణయ్య ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చేవూరులో రాయని శ్రీలేఖ తన మూడేళ్ల కుమార్తె వర్షితకు ఉరేసుకొని తానూ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. పెళ్లయిన మూడేళ్ల వరకు భార్యాభర్తలు బాగానే ఉన్నారు. కొంత కాలం నుంచి భర్త చెంచుబాబు వ్యవసనాలకు అలవాటు పడి శ్రీలేఖను వేధించాడు. ఆ వేధింపులు భరించలేకే శ్రీలేఖ ఇలా అఘాయిత్యానికి పాల్పడిందని రమణయ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రమణయ్య ఫిర్యాదు మేరకు భర్త చెంచుబాబు, అత్త,మామ యానాది, కోటేశ్వరమ్మలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పాండురంగారావు తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించినట్లు ఎస్ఐ పాండురంగారావు పేర్కొన్నారు. -
దైవదర్శనానికి వెళుతూ..
గుడ్లూరు/కరీంనగర్ క్రైం: ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. పుణ్యక్షేత్రాలను దర్శించడానికి కారులో బయలుదేరిన వీరిని మార్గమధ్యలో మృత్యువు కబళించింది. శుక్రవారం ఏపీలోని ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలోని జాతీయ రహదారిపై ఈ ఘోర ప్రమాదం జరిగింది. మృతులంతా తెలంగాణవాసులు. హైదరాబా ద్లో వంగపల్లి వంశీ (38), అపర్ణ (35) దంపతు లు ఐటీ ఉద్యోగులు. వీరికి ఇద్దరు కుమారులు అద్యత్ (8), క్రిషాన్ (6) ఉన్నారు. వంశీ తనకు టుంబ సభ్యులు అత్తమామలతో కలసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకున్నాడు. హైదరాబాద్ నుంచి తిరుపతికి రైలు రిజర్వేషన్ కూడా చేయించుకున్నాడు. కరీంనగర్లో ఉండే వంశీ అత్తమామలు కొంపల్లి మల్హల్రావు (67), లీల (63) తిరుపతి వెళ్లేందుకు గురువారం రాత్రికే హైదరాబాద్ చేరుకున్నారు. వీరంతా కలసి శుక్రవారం వరలక్ష్మి వ్రతం కావడంతో దుర్గమ్మ దర్శ నం చేసుకుంటే బాగుంటుందని చర్చించుకున్నా రు. దీంతో రైలు ప్రయాణం విరమించుకొన్నారు. ముందుగా విజయవాడ వెళ్లి అక్కడ నుంచి తిరు మలకు వెళ్లాలని నిశ్చయించుకున్నారు. వంశీ దంపతులు, పిల్లలు అత్తమామలు ఆరుగురు కలసి తమ కారులో విజయవాడకు బయలుదేరారు. శుక్రవారం ఉదయం కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. తిరుమలకు వెళ్తూ మార్గం మధ్యలో శ్రీకాళహస్తి ఆలయాన్ని కూడా సందర్శించి వెళ్దామని భావించారు. శ్రీకాళహస్తికి వెళ్తుండగా శుక్రవారం మధ్యాహ్నం ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం మోచెర్ల వద్దకు వచ్చే సరికి వేగంగా వస్తున్న వీరి కారు జాతీయ రహదారిపై ముందు ఆగి ఉన్న పార్శిల్ సర్వీసు లారీని ఢీ కొట్టింది. దీంతో కారు లో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. తీవ్ర గాయాలైన అద్యత్ను రోడ్డు భద్రతా సిబ్బంది నెల్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించా రు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. గురువారం రాత్రి నుంచి వంశీ ఒక్కడే కారు నడుపుతున్నాడు. అతివేగం, నిద్రమత్తు వలనే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. సీట్‌బెల్టు పెట్టుకుని, బెలూన్ బయట కొచ్చినా ఈప్రమాదం లో ఒక్కరూ ప్రాణాలతో మిగల్లేదు. -
లారీ, కారు ఢీ; ఆరుగురు దుర్మరణం..!
సాక్షి, ప్రకాశం/కరీంనగర్ : జిల్లాలోని గుడ్లూరు మండలం మెచర్ల వద్ద శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుంటుంబానికి చెందిన ఆరురుగు దుర్మరణం పాలయ్యారు. వీరంతా కరీంనగర్ జిల్లా వాసులుగా తెలిసింది. దీంతో వారి స్వగ్రామమైన భాగ్యనగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల్లో కొంపల్లి లీలా-మలహల్రావు దంపతులు, వారి కూతురు అర్చన, అల్లుడు వంశీకృష్ణ ఉన్నారు. అర్చన-వంశీకృష్ణ దంపతుల కుమారులు అద్వైత (7), కృషాణ్ (5) కూడా ఈ ప్రమాదంలో కన్నుమూశారు. విజయవాడలో దుర్గమ్మ దర్శనం చేసుకుని తిరుమలకు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్టు తెలిసింది. వంశీకృష్ణ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుండేవాడని సమాచారం. -
ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచండి
గుడ్లూరు, న్యూస్‌లైన్: ఉపాధ్యాయులు అకింతభావంతో పని చేసి విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని డీఈఓ రాజేశ్వరరావు అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యూటీఎఫ్ జిల్లా స్థాయి విద్యా చైతన్య సదస్సు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం లేకపోవడంతోనే పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై అభద్రతభావాన్ని పోగొట్టాల్సిన బాధ్యత ఉపాధ్యాయులుపై ఉందన్నారు. అక్షర ప్రకాశంలో ప్రతి ఉపాధ్యాయుడూ భాగస్వామి కావాలని కోరారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నేటి కాలానికి అనుగుణంగా విద్యా రంగాన్ని సంస్కరించాలన్నారు. స్వార్థ ప్రమోజనాల కోసమే రాష్ట్రాన్ని విడదీస్తున్నారని మండిపడ్డారు. ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటంలో యూటీఎఫ్ ముందుందని చెప్పారు. ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ సమైక్యం కోసం పోరాడని సీమాంధ్ర రాజకీయ నాయకులకు పదవుల్లో కొనసాగే అర్హత లేదన్నారు. విద్యలో జిల్లా వెనకబడి ఉందని చెప్పారు. ఎమ్మెల్సీ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తోందని విమర్శించారు. అనంతరం యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామిరెడ్డి, వైఎస్ఆర్ సీపీ కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త తూమాటి మాధవరావు ప్రసంగించారు. సదస్సులో డిప్యూటీ డీఈఓ చాంద్‌బేగం, పీఈఓ వెంకట్రావు, ఎంఈఓ సుధాకరరావు, ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీ కరస్పాండెట్ కంచర్ల రామయ్య, దివి శ్రీనివాసులు నాయుడు, రమణారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, జాన్ విలియం పాల్గొన్నారు. -
ఎరువుల దుకాణంపై దాడి
గుడ్లూరు, న్యూస్‌లైన్ : లెసైన్స్ రెన్యువల్ చేయించుకోకుండా ఎరువులను అమ్ముతున్న దుకాణంపై కందుకూరు ఏడీఏ శేఖర్‌బాబు శనివారం సాయంత్రం ఆకస్మికంగా దాడి చేసి 6.28 లక్షల విలువైన 42 టన్నుల ఎరువులను సీజ్ చేశారు. ఏడీఏ తెలిపిన వివరాల ప్రకారం.. గుడ్లూరు మొయిన్ బజారులోని శ్రీసాయి ఫెర్టిలైజర్స్ ఎరువుల దుకాణం లెసైన్స్ గడువు రెండు నెలల క్రితం ముగిసింది. అప్పటి నుంచి షాపు యజమాని లెసైన్స్‌ను రెన్యువల్ చేయించుకోకుండా వివిధ రకాలైన ఎరువులు, పురుగుమందులు విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న కందుకూరు ఏడీఏ శేఖర్‌బాబు శనివారం ఎరువుల దుకాణంపై దాడి చేశారు. దుకాణంలో ఉన్న రికార్డులు, స్టాకు రిజిస్టర్లను తనిఖీ చేశారు. అనుమతి లేకుండా నిల్వ ఉన్న డీఏపీ, యూరియా, ఎస్ఎస్పీ, వివిధ రకాలైన కాంప్లెక్స్ ఎరువులు 42 టన్నులు స్వాధీనం చేసుకుని వీఆర్వో పీరయ్య సమక్షంలో గోడౌన్‌ను సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న ఎరువుల విలువ రూ 6.28 లక్షలు ఉంటుందని ఏడీఏ తెలిపారు. దుకాణం యజమానిపై కేసు నమోదు చేసి జిల్లా కోర్టుకు సమర్పిస్తామన్నారు. కోర్టు ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనుమతి లేకుండా, లెసైన్స్‌లు రెన్యువల్ చేయించుకోకుండా ఎరువులు, పురుగు మందులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏడీఏ హెచ్చరించారు. ఏడీఏ వెంట మండల వ్యవసాయ అధికారి ఉన్నారు.