దైవదర్శనానికి వెళుతూ.. | Road Accident Six Members Of One Family Died | Sakshi
Sakshi News home page

దైవదర్శనానికి వెళుతూ..

Published Sat, Aug 10 2019 2:21 AM | Last Updated on Sat, Aug 10 2019 8:18 AM

Road Accident Six Members Of One Family Died - Sakshi

శుక్రవారం ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు

గుడ్లూరు/కరీంనగర్‌ క్రైం: ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. పుణ్యక్షేత్రాలను దర్శించడానికి కారులో బయలుదేరిన వీరిని మార్గమధ్యలో మృత్యువు కబళించింది. శుక్రవారం ఏపీలోని ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలోని జాతీయ రహదారిపై ఈ ఘోర ప్రమాదం జరిగింది. మృతులంతా తెలంగాణవాసులు. హైదరాబా ద్‌లో వంగపల్లి వంశీ (38), అపర్ణ (35) దంపతు లు ఐటీ ఉద్యోగులు. వీరికి ఇద్దరు కుమారులు అద్యత్‌ (8), క్రిషాన్‌ (6) ఉన్నారు. వంశీ తనకు టుంబ సభ్యులు అత్తమామలతో కలసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకున్నాడు. హైదరాబాద్‌ నుంచి తిరుపతికి రైలు రిజర్వేషన్‌ కూడా చేయించుకున్నాడు. 

కరీంనగర్‌లో ఉండే వంశీ అత్తమామలు కొంపల్లి మల్‌హల్‌రావు (67), లీల (63) తిరుపతి వెళ్లేందుకు గురువారం రాత్రికే హైదరాబాద్‌ చేరుకున్నారు. వీరంతా కలసి శుక్రవారం వరలక్ష్మి వ్రతం కావడంతో దుర్గమ్మ దర్శ నం చేసుకుంటే బాగుంటుందని చర్చించుకున్నా రు. దీంతో రైలు ప్రయాణం విరమించుకొన్నారు. ముందుగా విజయవాడ వెళ్లి అక్కడ నుంచి తిరు మలకు వెళ్లాలని నిశ్చయించుకున్నారు. వంశీ దంపతులు, పిల్లలు అత్తమామలు ఆరుగురు కలసి తమ కారులో విజయవాడకు బయలుదేరారు. శుక్రవారం ఉదయం కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. తిరుమలకు వెళ్తూ మార్గం మధ్యలో శ్రీకాళహస్తి ఆలయాన్ని కూడా సందర్శించి వెళ్దామని భావించారు. 

శ్రీకాళహస్తికి వెళ్తుండగా శుక్రవారం మధ్యాహ్నం ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం మోచెర్ల వద్దకు వచ్చే సరికి వేగంగా వస్తున్న వీరి కారు జాతీయ రహదారిపై ముందు ఆగి ఉన్న పార్శిల్‌ సర్వీసు లారీని ఢీ కొట్టింది. దీంతో కారు లో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. తీవ్ర గాయాలైన అద్యత్‌ను రోడ్డు భద్రతా సిబ్బంది నెల్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించా రు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. గురువారం రాత్రి నుంచి వంశీ ఒక్కడే కారు నడుపుతున్నాడు. అతివేగం, నిద్రమత్తు వలనే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. సీట్‌బెల్టు పెట్టుకుని, బెలూన్‌ బయట కొచ్చినా ఈప్రమాదం లో ఒక్కరూ ప్రాణాలతో మిగల్లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement