ప్రమాదంలో మృతిచెందిన దంపతులు
రేగొండ(భూపాలపల్లి): ప్రమాదవశాత్తు బైక్ చెట్టుకు ఢీకొని దంపతులు మృతి చెందిన సంఘటన రేగొండ శివారులోని జగ్గయ్యపేట ప్రధాన రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని సుల్తాన్‌పురం శివారు వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి చెందిన చిరిపోతుల రవి, అరుణ దంపతులు చిట్యాల మండలం గోపాలపురం గ్రామానికి వివాహానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో సుల్తాన్‌పురం శివారులోని కోళ్లఫారం సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టుకు ఢీకొంది. దీంతో రవి, అరుణ అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులకు కొడుకు, కూతురు ఉన్నారు. తల్లిదండ్రులు ప్రమాదంలో మృతి చెందడంతో పిల్లలు అనాథలుగా మిగిలారు
Comments
Please login to add a commentAdd a comment