
ప్రమాద స్థలంలో మృతదేహం
లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యోగా గురుతో పాటు మరో ఇద్దరు మృతిచెందారు. వీరిలో ఓ కాంగ్రెస్ నాయకుడు కూడా ఉన్నారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఫాగుహ బాటియా ప్రాంతానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. యోగా గురు లక్ష్మీపతి వర్మ వెళ్తున్న కారును ఎదురుగా వ్యతిరేక మార్గంలో వచ్చి మరో కారు బలంగా ఢీకొట్టింది. ఇదే సమయంలో యోగా గురు ప్రయాణిస్తున్న కారును వెనక నుంచి మరో కారు ఢీకొట్టింది. మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో మొత్తం ముగ్గురు చనిపోయారు.
మృతుడు యోగాగురు లక్ష్మీపతి ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్‌కు సన్నిహితుడు. ఈ ఘటనలో యోగాగురుతో పాటు కాంగ్రెస్ నాయకుడు ధరం రాజ్ వర్మ, హరి మోహన్ అగర్వాల్(58) మరో కారులో చనిపోయారు. గాయపడిన ఆరుగురిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment