
సాక్షి, కృష్ణా: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం జగ్గయ్యపేట మండలంలోని గరికపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు ముందువెళ్లుతున్న లారీని వెనక నుంచి ఢీకొట్టగా ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. గాయపడినవారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వేములువాడ ఆలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతి చెందిన వారిని ఖమ్మం జిల్లాలోని మధిరకు చెందిన మాచర్ల శ్యామ్, శారద, శ్యామలగా పోలీసులు గుర్తించారు. కాగా, మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక వృద్దుడు ఉన్నారు. ఈ కారులో డ్రైవర్‌తో పాటు 9 మంది ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment