నగరంలోని ఖైరతాబాద్ ప్రాంతంలోగల షాదన్ కాలేజీ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
నగరంలోని ఖైరతాబాద్ ప్రాంతంలోగల షాదన్ కాలేజీ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ప్రయాణిస్తోన్న ద్విచక్రవాహనం ఒక్కసారిగా అదుపుతప్పి కిందపడటంతో ఈ ప్రమాదం జరిగింది.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులను మహ్మద్ నదీం, నసీర్ బిన్ సలేహ్ బిన్ అపేన్ గా గుర్తించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించి, బంధువులకు సమాచారం అంజేస్తామని పోలీసులు చెప్పారు.