ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవులకు రాజీనామా చేసి.. దీక్షలు చేసే దమ్ము టీడీపీ ఎంపీలకు ఉందా అని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి సవాల్ విసిరారు. ఈ నెల 24న చేపట్టనున్న రాష్ట్ర బంద్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. హోదా కోసం పోరాటం చేస్తున్నట్లు టీడీపీ నటిస్తోందని విమర్శల వర్షం కురిపించారు.