అనంతపురం: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై అధికార టీడీపీ ప్రభుత్వం కక్ష కట్టిందని కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్బాషా (వైఎస్సార్సీపీ) మండిపడ్డారు. సోమవారం ఆయన అనంతపురంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి (ఉరవకొండ) తో కలిసి విలేకరులతో మాట్లాడారు.
జెడ్పీ సమావేశంలో మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రొటోకాల్ పాటించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్యేలను కలిసిన అధికారులను బదిలీ చేస్తామంటూ టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారని చాంద్ బాషా మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షంపై దాడులు చేయటం ఎంతవరకు సమంజసం అని చాంద్బాషా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
వైఎస్సార్సీపీకి చెందిన మరో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. 'ఏదో ఒక రూపంలో ప్రజలకు సాయం చేస్తే చాలు' అనే కోణంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చే వరకు వైఎస్సార్సీపీ పోరాడుతుందని ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి చెప్పారు.
'వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై ప్రభుత్వం కక్ష కట్టింది'
Published Mon, May 25 2015 4:29 PM | Last Updated on Tue, May 29 2018 2:55 PM
Advertisement
Advertisement