మోదీ..భారత్ అంటుంటే...చంద్రబాబు మాత్రం...
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రహస్య అజెండా ఉందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఆయన మంగళవారం ఉదయం 'సాక్షి' హెడ్లైన్ షోలో మాట్లాడుతూ మోదీ భారత్...భారత్ అంటుంటే... చంద్రబాబు మాత్రం సింగపూర్ అంటున్నారని ఎద్దేవా చేశారు.
ఈ సందర్భంగా రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి మాట్లాడుతూ రాజధాని అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదన్నారు. రాజధాని విషయంలో చంద్రబాబు రహస్య అజెండాపై చర్చ జరగాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌతమ్ డిమాండ్ చేశారు. రైతులకు నష్టం చేకూర్చాలని చంద్రబాబుకు లేదని టీడీపీ ఎమ్మెల్సీ రామ్మోహన్ అన్నారు.