కరువు మండలాల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలి | mla visweswara reddy demands helping actions on drought mandals | Sakshi
Sakshi News home page

కరువు మండలాల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలి

Published Sat, Oct 22 2016 11:29 PM | Last Updated on Tue, May 29 2018 2:33 PM

కరువు మండలాల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలి - Sakshi

కరువు మండలాల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలి

ఉరవకొండ : కరువు మండలాల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి డిమాండ్‌ చేశారు. రెయిన్‌గన్లతో పంటలు కాపాడి కరువును పాలదోలానని సన్మానాలు చేయించుకున్న  వుుఖ్యవుంత్రి చంద్రబాబు ఆఖరుకు నిజాన్ని ఒప్పుకుని జిల్లాలో 63 వుండలాలను కరువు ప్రాంతాలు ప్రకటించారన్నారు. విడపనకల్లు వుండలం కడదరబెంచి గ్రావుంలో గడప గడపకూ వైఎస్సార్‌ కార్యక్రవుంలో పాల్గొన్న అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సవూవేశంలో ఎమ్మెల్యే వూట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 250 కరువు మండలాలను ప్రకటించి, చేతులు దులుపుకోకుండా వెంటనే సహాÄýæుక చర్యలు చేపట్టాలన్నారు. 

జిల్లా రైతాంగం దుస్ధితిని ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లడానికి గత నెలలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  వేలాది వుంది రైతులతో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టి, ప్రభుత్వానికి కనువిప్పు కల్గించారని గుర్తు చేశారు. వేరుశనగ పంట నష్టపోయిన రైతులందరికీ ఎకరాకు రూ.20 వేల  ఇన్‌పుట్‌ సబ్సిడీను అందించాలన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా తీవ్ర వర్షాభావంతో నల్లరేగడి భూవుుల్లో రైతులు శనగ విత్తనాలు కూడా వేయలేకపోయారన్నారు. చంద్రబాబు రైతుల దుస్ధితిని అర్ధం చేసుకుని రుణవూఫీను విడతల వారీగా కాకుండా ఒకే సారి అవులు చేసి, కొత్తగా బ్యాంకుల్లో రుణాలు వుంజూరు చేయించాలన్నారు. అలాగే కరువు పరిస్ధితుల దష్ట్యా విద్యార్థుల ఫీజులన్నీ రద్దు చేసి, బకాయిపడ్డ స్కాలర్‌షిప్, రీయింబర్స్‌మెంట్‌ను చెల్లించాలని డివూండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement