సాక్షి, షాద్ నగర్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కాంగ్రెస్ నేతలను తెలంగాణలో ఎలా పుట్టారో అంటున్నారని, కేసీఆర్ ఆయన జిల్లాలో ఎలా పుట్టారో తాము కూడా తమ జిల్లాలో అలానే పుట్టామని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఆదివారం షాదనగర్ మండలం చౌదరి గూడలో జరిగిన జలసాధన సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను ఇక్కడ ఇంజనీరింగ్ చేసినా.. అమెరికాలో ఇంజనీర్ సదివిన.. కానీ కేసీఆర్ ఇంజనీరింగ్ ప్లాన్ మాత్రం అర్థం కావడం లేదు. మా ప్రాంతానికి నాలుగు నెలల్లో నీళ్లు తెస్తే కేసీఆర్‌కు గుడి కడతా. మృగశిర పండుగ తరువాత చంద్రశిర పండగ చేస్తాం. ఇచ్చిన మాట తప్పితే... చంద్రశిర ఖండన చేద్దాం’’ అంటూ ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment