సాక్షి, అనంతపురం: చంద్రబాబు రాయలసీమకు ఏం చేశారో చెప్పాలని వైఎస్సార్ సీపీ నేత, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సీమ గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు. రాయలసీమ జిల్లా అభివృద్ధి గురించి బాబు ఏరోజైనా ఆలోచించారా? ఒక్క ప్రాజెక్టునైనా కట్టారా? ఎన్నికలొస్తున్నప్పుడే బాబుకు ప్రాజెక్టులు గుర్తొస్తాయి’’ అంటూ దుయ్యబట్టారు.
‘‘చంద్రబాబు రాయలసీమ వ్యతిరేకి. వైఎస్సార్ జలయజ్ఞం చేపడితే చంద్రబాబు అడ్డుకున్నారు. వైఎస్సార్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరిస్తే చంద్రబాబు వ్యతిరేకించారు. వైఎస్సార్ పోతిరెడ్డిపాడు విస్తరణ వల్లే రాయలసీమకు సాగు, తాగు నీటి కష్టాలు తీరాయి. 1996, 1999లో రెండు సార్లు హంద్రీనీవా ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసిన చంద్రబాబు ఎందుకు పనులు చేయలేదు?. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే హంద్రీనీవా, గాలేరు-నగరి సహా రాయలసీమ ప్రాజెక్టులకు మోక్షం లభించింది. హంద్రీనీవా కోసం ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుంది’’ అని విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు.
చదవండి: సంపద పెరిగింది..అప్పులు తగ్గాయి
‘‘40 టీఎంసీల హంద్రీనీవా ప్రాజెక్ట్‌ను ఐదు టీఎంసీలకు కుదించి సీమకు అన్యాయం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు. కరవు ప్రాంతాలకు కృష్ణా జలాలు వైఎస్సార్ పుణ్యమే. చంద్రబాబు హయాంలో సాగునీటి ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది. సీఎం జగన్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాల వల్ల రైతులకు ఎంతో మేలు జరిగింది. పెండింగ్ ప్రాజెక్టులను సీఎం జగన్ చిత్తశుద్ధితో పూర్తి చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు ఓడిపోబోతున్నారు. ఓటమి భయంతోనే చంద్రబాబు అండ్ కో దొంగ ఓట్ల డ్రామాలు. ఉరవకొండ నియోజకవర్గంలో పయ్యావుల కేశవ్ ఎప్పుడూ దొంగ ఓట్లతోనే గెలుస్తారు’’ అని విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment