
ప్రమాదంపై న్యాయవిచారణ జరిపించాలి: విశ్వేశ్వర రెడ్డి
అనంతపురం: వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెనుకొండ దుర్ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
బస్సు డ్రైవరే ప్రమాదానికి కారణమని సీఎం వ్యాఖ్యానించడం బాధాకరమని విశ్వేశ్వర రెడ్డి అన్నారు. ప్రమాదంపై రవాణా శాఖ కమిషనర్ నిష్పాక్షికంగా విచారణ చేస్తారన్న నమ్మకం లేదని సందేహం వ్యక్తం చేశారు. న్యాయ విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు.