'జన్మభూమి'ని బహిష్కరించిన ఎమ్మెల్యే | YSR Congress Party MLA Visweswara reddy takes on TDP Government Due to Farmer Crop loan | Sakshi
Sakshi News home page

'జన్మభూమి'ని బహిష్కరించిన ఎమ్మెల్యే

Published Sat, Oct 4 2014 12:49 PM | Last Updated on Mon, Oct 1 2018 3:56 PM

'జన్మభూమి'ని బహిష్కరించిన ఎమ్మెల్యే - Sakshi

'జన్మభూమి'ని బహిష్కరించిన ఎమ్మెల్యే

అనంతపురం : ఎన్నికల ముందు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి... అధికారంలో వచ్చిన టీడీపీ ప్రభుత్వం... ఆ హామీలను తుంగలోకి తొక్కిందని ఉరవకొండ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శనివారం పూడేరులో నిర్వహించిన జన్మభూమి - మాఊరు కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు విశ్వేశ్వరరెడ్డి ప్రకటించారు.

అలాగే అదే జిల్లాలోని ఉరవకొండ మండలం టెక్సానుపల్లిలో జన్మభూమి - మా ఊరు కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. గ్రామంలోని సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నతాధికారులను నిలదీశారు. దాంతో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు ఆగ్రహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఒకానొక దశలో ఒకరినొకరు తోసుకున్నారు. మరింత ఆగ్రహించిన ఇరుపార్టీల వారు దాడులు చేసుకున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement