మోసాలను ఎండగడితే తట్టుకోలేకున్నారు
రాయదుర్గం అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వ మోసాలను ప్రజలు ఎత్తి చూపుతుంటే టీడీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్‌ఎం మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం రాయదుర్గం పట్టణంలోని 18వవార్డులో నిర్వహించిన గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమాన్ని పరిశీలించడానికి వచ్చిన సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త కాపు రామచంద్రారెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గడప గడపకూ వైఎస్సార్ జరిగిన ప్రతి చోటా విశేష ఆదరణ వస్తోందన్నారు. దీంతో భయం చుట్టుకున్న అధికార పార్టీ నాయకులు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్నామంటూ ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందకుండా అన్యాయం చేశారని ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు.