LM Mohan Reddy
-
మోసాలను ఎండగడితే తట్టుకోలేకున్నారు
రాయదుర్గం అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వ మోసాలను ప్రజలు ఎత్తి చూపుతుంటే టీడీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం రాయదుర్గం పట్టణంలోని 18వవార్డులో నిర్వహించిన గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమాన్ని పరిశీలించడానికి వచ్చిన సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త కాపు రామచంద్రారెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గడప గడపకూ వైఎస్సార్ జరిగిన ప్రతి చోటా విశేష ఆదరణ వస్తోందన్నారు. దీంతో భయం చుట్టుకున్న అధికార పార్టీ నాయకులు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్నామంటూ ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందకుండా అన్యాయం చేశారని ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. -
'చంద్రబాబు డైరెక్షన్ లోనే దాడులు'
అనంతపురం: టీడీపీ నాయకులు పోలీసులు తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ ఎం మోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రసాద్ రెడ్డి హత్యకేసును పక్కనపెట్టి తమ పార్టీ కార్యకర్తలు, నేతలను అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిలను సోమవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వైఎస్సార్ సీపీలో కీలకంగా పనిచేస్తున్న నేతలపై చంద్రబాబు డైరెక్షన్ లోనే దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. కాగా టీడీపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు అనంతపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు. -
నమ్మించి మోసగించడం చంద్రబాబు నైజం
కళ్యాణదుర్గం : నమ్మించి ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నైజమని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్‌రెడ్డి విమర్శించారు. అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులతో కొట్టించడం దారుణమన్నారు. మంగళవారం ఆయన పట్టణంలోని స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. మహిళల శాపానికి చంద్రబాబు మసైపోతారన్నారు. అప్పట్లో తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించి..బాష్పవాయు ప్రయోగాలు చేయించారని గుర్తు చేశారు. దీంతో ఆయన్ను ప్రజలు పదేళ్లు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్నారు. వైఎస్ మరణానంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు మోసపు మాటలను నమ్మిన ప్రజలు తిరిగి అధికారాన్ని కట్టబెట్టారని తెలిపారు. ఆయన తిరిగి పాత పద్ధతులనే అవలంబిస్తూ నిత్యం అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. అప్పట్లో హంద్రీ-నీవాకు రెండుసార్లు శంకుస్థాపన చేసి మభ్య పెట్టారని గుర్తు చేశారు. అదే వైఎస్ హయాంలో రూ.5,600 కోట్లు ఖర్చు చేసి 90 శాతం పనులను పూర్తి చేశారని తెలిపారు. హంద్రీ-నీవాను ఎన్టీఆర్ మానస పుత్రికగా చెబుతున్న టీడీపీ మంత్రులు మిగిలిన పనులను పూర్తి చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా లభిస్తే దానిని పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టిసీమ ప్రాజెక్టుకు రూ.1,300 కోట్లు కేటాయించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. వీటన్నింటి పైనా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అసెంబ్లీలో నిలదీస్తే టీడీపీ ఎమ్మెల్యేలతో వ్యక్తిగత ఆరోపణలు చేయించడం తగదన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ నాయకులు.. పోలీసులను కూడా బెదిరిస్తున్నారని తెలిపారు. ఇక సామాన్యులకు న్యాయం, రక్షణ ఎక్కడ దొరుకుతుందని ప్రశ్నించారు. కళ్యాణదుర్గం డీఎస్పీ అనిల్ పులిపాటి స్పందించి పోలీసు వ్యవస్థను సక్రమంగా నడిపించాలని కోరారు. సమావేశంలో వైఎస్సార్సీపీ సేవాదల్ నాయకులు కృష్ణకుమార్, గోళ్లసూరి, రాజమెర్లిన్, హనుమంతరాయుడు, కొల్లప్ప, బాలప్ప, గురుమూర్తి, వన్నూర్‌స్వామి పాల్గొన్నారు. -
'చంద్రబాబు డైరెక్షన్లో పవన్ కళ్యాణ్'
అనంతపురం: జనసేన పేరుతో పార్టీ పెట్టిన సినీ నటుడు పవన్ కళ్యాణ్... టీడీపీతో కుమ్మక్కయ్యారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్.ఎమ్.మోహన్‌రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని అన్నారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత దాన్ని నడపలేక చిరంజీవి కాంగ్రెస్‌లో కలిపారని, పార్టీ పెట్టక ముందే చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కుమ్మక్కయ్యారని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజాన్నిఆపలేరని మోహన్‌రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.