అనంతపురం: టీడీపీ నాయకులు పోలీసులు తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ ఎం మోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రసాద్ రెడ్డి హత్యకేసును పక్కనపెట్టి తమ పార్టీ కార్యకర్తలు, నేతలను అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిలను సోమవారం ఆయన పరామర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... వైఎస్సార్ సీపీలో కీలకంగా పనిచేస్తున్న నేతలపై చంద్రబాబు డైరెక్షన్ లోనే దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. కాగా టీడీపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు అనంతపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
'చంద్రబాబు డైరెక్షన్ లోనే దాడులు'
Published Mon, May 4 2015 2:54 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement