- వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షులు కొలుసు పార్థసారథి
సవారిగూడెం (గన్నవరం) : మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఏరుదాటకే తెప్పతాగలేసిన చందంగా ప్రజలను నయవంచనకు గురిచేస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి విమర్శించారు. మండలంలోని సవారిగూడెంలో వైఎస్సార్ సీపీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శుక్రవారం రాత్రి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం పార్థసారథి మాట్లాడుతూ... టీడీపీ అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్నప్పటికీ ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని సక్రమంగా నెరవేర్చలేదన్నారు.
రుణమాఫీ పేరుతో డ్వాక్రా మహిళలు, రైతులకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. టీడీపీ నాయకులు నీరు-చెట్టు పథకం పేరుతో గ్రామాల్లో యథేచ్ఛగా మట్టి దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. దివంగత వైఎస్సార్ హయాంలో రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ పథకాలు అందజేస్తే, టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో పేదల పింఛన్లు, రేషన్ కార్డులను తొలగి స్తోందని ఆరోపించారు. జిల్లా నాయకులు కోటగిరి వరప్రసాదరావు, కాసర్నేని గోపాలరావు, కొల్లి రాజశేఖర్, నక్కా గాంధీ, ఎండీ గౌసాని, గన్నవరం సర్పంచి నీలం ప్రవీణ్‌కుమార్, యూత్ అధ్యక్షుడు వేమూరి రవి, నాయకులు నిడమర్తి నాగేశ్వరరావు, రామారావు, దొండపాటి నాగరాజు, కోడేబోయిన బాబు, గ్రామ నాయకులు టి. రవికుమార్, కోటేశ్వరరావు, శివయ్య, పి. శ్రీని వాసరావు, ఏడుకొండలు పాల్గొన్నారు.
ప్రజలను నయవంచనకు గురిచేసిన టీడీపీ
Published Sun, Apr 26 2015 4:27 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
Advertisement