పుట్టపర్తి టౌన్ :
జావా లాంగ్వేజ్‌పై పట్టు సాధిస్తే సాఫ్ట్‌వేర్ రంగంలో విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తు సాధించవచ్చునని ఆస్ట్రియాకు చెందిన వియన్నా యూనివర్శిటీ ఐటీ విభాగం ఉపన్యాసకుడు పౌల్‌స్పెసిబర్గర్ అన్నారు.సంస్కృతీ విద్యాసంస్థలు, వియన్నా యూనివర్శిటీ అనుబంధంగా కళాశాల విద్యార్థులకు అందిస్తున్న నాలుగు సంవత్సరాల ఐటీ కోర్సులో ఉత్తమ ప్రతిభ కనబరిచన విద్యార్థులకు పౌల్ స్పెసిబర్గర్ సర్టిఫికెట్లను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీ రంగంలో జావా లాంగ్వేజ్‌లకు విపరీతమైన ఆదరణ ఉందన్నారు.ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సంస్కృతీ విద్యాసంస్థలలో నాలుగు సంవత్సరాల ఐటీ కోర్సును విద్యార్థులకు అందజేస్తోందన్నారు. ఇందులో కంప్యూటర్ లాంగ్వేజస్‌కు ప్రాధాన్య ఇస్తున్నామన్నారు. ప్రతిభ కనబరచిన వారికి ఆస్ట్రియాకు చెందిన రైజ్ కంపెనీలో మంచి పారితోషికంతో ఉద్యోగం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.