అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా పుట్టపర్తి | Chandrababu naidu Prays for Puttaparthi Sai Baba | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా పుట్టపర్తి

Published Fri, Jul 3 2015 11:47 AM | Last Updated on Fri, Jun 1 2018 8:31 PM

Chandrababu naidu Prays for Puttaparthi Sai Baba

అనంతపురం : పుట్టపర్తిని అంతర్జాతీయ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మార్చుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన శుక్రవారం పుట్టపర్తిలోని సత్యసాయిబాబా మహా సమాధిని సందర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పుట్టపర్తి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని హామీ ఇచ్చారు.

కాగా హంద్రీ-నీవా ప్రాజెక్టు పనుల పరిశీలన నిమిత్తం చంద్రబాబు జిల్లాలో పర్యటిస్తున్నారు. బెళుగప్ప మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్ వద్ద పంపింగ్ హౌస్, అక్విడెక్ట్ పనులను పరిశీలించనున్నారు. అనంతరం అక్కడే హంద్రీ-నీవా, గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుల పనుల తీరుపై నీటి పారుదలశాఖ అధికారులతో సమీక్షిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement