Satya Saibaba
-
సమీప నివాసమే ఉపవాసం
ప్రేమ, శాంతి, సహనం, సత్యం, సేవాతత్పరత వంటి అనేక మేలు గుణాలు కలగలసిన మహానుభావుడు భగవాన్ శ్రీసత్యసాయిబాబా. ఈ నెల 23, శుక్రవారం బాబా జయంతి సందర్భంగా ఆయన బోధామృతంలోని కొన్ని చినుకులు... ♦ పిల్లలు తమలోని దైవిక ప్రజ్ఞలను పెంపొందించుకోవడానికి తల్లిదండ్రులు అన్ని అవకాశాలూ కల్గించాలి. యజమాని తోటలో తోటమాలి మొలకల్ని పెంచిన రీతిగా తల్లిదండ్రులు తమ ఇంట్లో పుట్టిన చిన్నారులను పెంచడానికి భగవంతుడు తమను నియమించాడని భావించాలి. పురాణ పురుషులు, రుషులు, మునుల కథలను చెబుతూ చిన్నారులలో దాగి ఉన్న మంచితనాన్ని ప్రేరేపించాలి. ♦ కొందరు కార్తీక పౌర్ణమి, శివరాత్రి, ముక్కోటి ఏకాదశి వంటి పర్వదినాలలో ఉపవాసం పేరిట అన్నపానాలు మాని చిరుతిండ్లు అధికంగా తింటూ ఉంటారు. ఇది ఉపవాసం కాదు. భగవంతునికి సమీప నివాసమే ఉపవాసం. ♦ భగవంతుని నామ సంకీర్తనంతో అఖండ భజనలతో హృదయాకాశాన్ని ప్రకాశింప చేయాలి. అప్పుడే అంతులేని ఆత్మానందం కలుగుతుంది. కనుక జీవితం ఉన్నంత వరకు నామ సంకీర్తనం చేయాలి. ♦ సాధన ద్వారా మనోచాంచల్యాన్ని నిరోధించి దైవోన్ముఖం చేయగలిగిన వానికి ఏ విధమైన వర్ణాశ్రమధర్మాలూ అవరోధం కాజాలవు. ♦ ముక్తికోసం మానవుడు అడవులకు, ఆలయాలకు, యాత్రలకు వెళ్లనవసరం లేదు. ముక్తిపొందటానికి కులగోత్రాలతోనూ, ఏకాంత దీక్షతోనూ, వనవాసంతోనూ ప్రమేయం లేదు. మానవునికి కర్మద్వారానే ముక్తి లభిస్తుంది. అదెలాగంటే, కర్మ చేసేటప్పుడు ఇంద్రియ ప్రభావాన్ని బుద్ధి నిలకడతో అణచివెయ్యాలి. అలా ఇంద్రియాల శక్తిని అరికట్టిన అంధుడైనా మోక్షం పొందుతాడు. భవబంధాలను దూరం చేసుకుని భగవంతుని యెడల ప్రగాఢ భక్తివిశ్వాసాలు పెంచుకొనటమొక్కటే మానవుని ముక్తికి కావలసిన అర్హతను ప్రసాదిస్తుంది. -
రేపు సత్యసాయి ఆరాధనోత్సవం
పుట్టపర్తి అర్బన్ : పుట్టపర్తి ప్రశాంతి నిలయం కేంద్రంగా ఈనెల 24న భగవాన్ సత్యసాయిబాబా ఆరాధనోత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించడానికి సత్యసాయి సెంట్రల్‌ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోన్న పుట్టపర్తిలో ఈశ్వరాంబ, పెద వెంకమరాజు దంపతులకు 1926 నవంబర్ 23న సత్యనారాయణరాజుగా పిలువబడే సత్యసాయిబాబా జన్మించారు. చిన్న నాటి నుంచి ఆధ్యాత్మిక చింతనతో గడిపిన ఆయన 1940లో తన 14వ యేట సత్యసాయిబాబాగా అవతార ప్రకటన చేశారు. నాటి నుంచి ఏకరూప వస్త్రధారి అయిన ఆయన దేశ,విదేశాలు సంచరిస్తూ మానవతా విలువలు, ఆధ్యాత్మికతను బోధిస్తూ తన ప్రేమ సామ్రాజ్యాన్ని సుమారు 180 దేశాల్లో నెలకొల్పారు. తక్కువ కాలంలోనే పుట్టపర్తికి అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు తీసుకొచ్చారు. దీంతో నిత్యం విదేశీయులు వేలాదిగా పుట్టపర్తికి విచ్చేస్తుంటారు. అపర భగీరథుడు సత్యసాయిబాబా : భక్తులకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా విద్య వైద్యం, తాగునీళ్లు,ఉచిత భోజన వసతి అందిస్తున్నారు. వరుస కరువులతో గుక్కెడు నీళ్లు దొరకని వందలాది గ్రామాల్లో తాగునీరు అందించి అపర భగీరథుడయ్యారు. 2011 ఏప్రిల్ 24న సత్యసాయి శివైక్యం పొందారు. ఆ తర్వాత నుంచి సత్యసాయి సెంట్రల్ ట్రస్టు అన్ని కార్యక్రమాలను కొనసాగిస్తూ భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు చెన్నై నగరానికి కూడా తాగునీళ్లు అందించారు. రెండేళ్ల క్రితం సుమారు రూ.100 కోట్లతో పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం మండలాలకు తాగునీటి వసతి కల్పించారు. ఇక పేదలను నయాపైసా ఖర్చు లేకుండా వైద్యం అందించడానికి కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించారు. పుట్టపర్తిలో డీమ్డ్ యూనివర్సిటీ నెలకొల్పి విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే సత్యసాయి సేవలు అనితర సాధ్యమైనవని భక్తులు చెప్పుకుంటున్నారు. యేటా ఏప్రిల్ 24న పుట్టపర్తిలో వైభవంగా ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నారు. -
భారతదేశం వేదాలకు నిలయం
పుట్టపర్తి అర్బన్: భారతదేశం వేదాలకు నిలయమని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. సత్యసాయి 92వ జయంతి వేడుకలను పురస్కరించుకొని అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సోమవారం నిర్వహించిన అంతర్జాతీయ వేద సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఉదయం 8 గంటలకు బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో పుట్టపర్తికి గవర్నర్ చేరుకున్నారు. మొదట సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. అనంతరం సదస్సులో మాట్లాడుతూ.. శాంతి, ప్రేమ, ధర్మాలను స్థాపించడం వేద అధ్యయనంతోనే సాధ్యమన్నారు. వేడుకల్లో 42 దేశాలకు చెందిన 15 వేల మంది వేద పండితులు హాజరై వేదపారాయణం చేశారు. -
సత్యసాయిగా మళయాల నటుడు
చనిపోయిన విష్ణువర్ధన్ హీరోగా నాగరాహువు సినిమా టీజర్‌ను రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచిన సీనియర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ మరో ఇంట్రస్టింగ్ న్యూస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే నాగరాహువు షూటింగ్ పూర్తి చేసిన కోడి రామకృష్ణ, ఆ సినిమాతో పాటు సత్య సాయిబాబ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమాను కూడా చాలా వరకు పూర్తి చేశాడు. చాలా కాలం క్రితమే ప్రకటించిన ఈ సినిమాకు నిర్మాత దొరకటం, తరువాత నటీనటులను ఎంపిక చేయటం ఆలస్యం కావటంతో ప్రాజెక్ట్ డిలే అయ్యింది. ముందుగా మళయాల నటుడు దిలీప్‌ను సత్యసాయి పాత్రకు ఎంపిక చేసినా.. అతడి స్టార్ ఇమేజ్ దృష్ట్యా అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న అనుమానంతో విరమించుకున్నాడు. ఫైనల్‌గా మరో మళయాల నటుడు శ్రీజిత్ విజయ్ను బాబా పాత్రకు ఎంపిక చేసిన కోడి రామకృష్ణ చాలా వరకు షూటింగ్ పూర్తి చేశాడు. సత్య సాయిబాబ భక్తుల సహకారంతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా మరో ఐదు నెలల షూటింగ్ మిగిలి ఉంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి 2017 మొదట్లోనే ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. అంతేకాదు బాబాకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఉన్నందున ఈ సినిమాను వీలైనన్ని ఎక్కువ భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -

అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా పుట్టపర్తి
అనంతపురం : పుట్టపర్తిని అంతర్జాతీయ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మార్చుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన శుక్రవారం పుట్టపర్తిలోని సత్యసాయిబాబా మహా సమాధిని సందర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పుట్టపర్తి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని హామీ ఇచ్చారు. కాగా హంద్రీ-నీవా ప్రాజెక్టు పనుల పరిశీలన నిమిత్తం చంద్రబాబు జిల్లాలో పర్యటిస్తున్నారు. బెళుగప్ప మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్ వద్ద పంపింగ్ హౌస్, అక్విడెక్ట్ పనులను పరిశీలించనున్నారు. అనంతరం అక్కడే హంద్రీ-నీవా, గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుల పనుల తీరుపై నీటి పారుదలశాఖ అధికారులతో సమీక్షిస్తారు.