సత్యసాయిగా మళయాల నటుడు
చనిపోయిన విష్ణువర్ధన్ హీరోగా నాగరాహువు సినిమా టీజర్ను రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచిన సీనియర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ మరో ఇంట్రస్టింగ్ న్యూస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే నాగరాహువు షూటింగ్ పూర్తి చేసిన కోడి రామకృష్ణ, ఆ సినిమాతో పాటు సత్య సాయిబాబ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమాను కూడా చాలా వరకు పూర్తి చేశాడు.
చాలా కాలం క్రితమే ప్రకటించిన ఈ సినిమాకు నిర్మాత దొరకటం, తరువాత నటీనటులను ఎంపిక చేయటం ఆలస్యం కావటంతో ప్రాజెక్ట్ డిలే అయ్యింది. ముందుగా మళయాల నటుడు దిలీప్ను సత్యసాయి పాత్రకు ఎంపిక చేసినా.. అతడి స్టార్ ఇమేజ్ దృష్ట్యా అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న అనుమానంతో విరమించుకున్నాడు. ఫైనల్గా మరో మళయాల నటుడు శ్రీజిత్ విజయ్ను బాబా పాత్రకు ఎంపిక చేసిన కోడి రామకృష్ణ చాలా వరకు షూటింగ్ పూర్తి చేశాడు.
సత్య సాయిబాబ భక్తుల సహకారంతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా మరో ఐదు నెలల షూటింగ్ మిగిలి ఉంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి 2017 మొదట్లోనే ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. అంతేకాదు బాబాకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఉన్నందున ఈ సినిమాను వీలైనన్ని ఎక్కువ భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.