జపనీస్ పిల్ల.. అగ్గిపుల్ల.. సిగరెట్ మళ్లా | Japanees women devotee smoking on route to Puttaparthi | Sakshi
Sakshi News home page

జపనీస్ పిల్ల.. అగ్గిపుల్ల.. సిగరెట్ మళ్లా

Published Sat, Apr 23 2016 2:28 PM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM

Japanees women devotee smoking on route to Puttaparthi

వేలమైళ్లు ప్రయాణించి తెలుగు నేలపై అడుగుపెట్టింది. ఆమెను గిరీశం ఆవహించాడు. పైగా మరుజన్మలో దున్నపోతై పుట్టడం ఇష్టంలేదామెకు. అందుకే పెదవులమధ్య సిగరెట్ ను బంధించి..  చాకచక్యంగా అగ్గిపుల్లతో వెలిగించుకుని.. గుండెల నిండా(నిజానికి కడుపు నిండా అనాలేమో!) పొగపీల్చి, గుప్పున వదిలింది. అలా ఓ ఐదారు దమ్ములు. అంతే, గిరీశం ఆమెను వదిలిపెట్టి వెళ్లాడు.

అనంతపురం జిల్లాలోని పుట్టపర్తిలోని సత్యసాయి ఆలయానికి వచ్చిన జపనీస్ మహిళా భక్తురాలు అకానే ష్నోమియా.. మార్గం మధ్యలోని కొడికొండ చెక్ పోస్ట్ వద్ద బహిరంగంగా ధూమపానం చేస్తూ కంటపడింది. బహిరంగ ప్రదేశాల్లో స్మోకింగ్ రిస్ట్రిక్టెడ్ కాబట్టి, మహిళా స్మోకర్లు మన దేశంలో చాలా తక్కువ కాబట్టి, ఆమె వచ్చిందొక ఆథ్యాత్మిక క్షేత్రానికి కాబట్టి.. అకానే చర్య వార్త అయింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement