ఉపాధ్యాయురాలి తోసివేత
బుక్కపట్నం (పుట్టపర్తి) : తోటి ఉపాధ్యాయురాలిని మరో ఉపాధ్యాయురాలు తోసివేసింది. కిందపడిన ఉపాధ్యాయురాలు అపస్మారకస్థితికి చేరుకుంది. వివరాలిలా ఉన్నాయి. బుక్కపట్నం మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఆదేశాల మేరకు ‘విద్యార్థుల చదువు, ఎదుగు’ కార్యక్రమం చేపట్టారు. మంగళవారం ఉదయం ఇంగ్లిష్ సబ్జెక్టు టీచర్ వరలక్ష్మి ఆలస్యంగా పాఠశాలకు వచ్చారు. ఆమెను హెచ్‌ఎం రాధాశ్రీదేవి తన చాంబర్‌కు పిలిపించి వివరణ కోరారు.
ఇదే సమయంలో అక్కడికి వచ్చిన వైజయంతి అనే మరో టీచర్ ఏం జరిగిందో తెలియదుగానీ ఉన్నపళంగా వరలక్ష్మిని కిందకు తోసేశారు. దీంతో ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్లారు. కాసేపటి తర్వాత తేరుకున్న వరలక్ష్మి సెలవు పెట్టి ఇంటికెళ్లిపోయారు. అనంతరం ఆమెను కుటుంబ సభ్యులు అనంతపురం ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.
ప్రస్తుతం కోలుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయంపై హెచ్‌ఎం, సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై డీఈఓ లక్ష్మీనారాయణ డైట్ కళాశాల ప్రిన్సిపల్ జనార్ధన్‌రెడ్డిని విచారణకు ఆదేశించారు. ఈ మేరకు డైట్‌కళాశాల ప్రిన్సిపల్ పాఠశాలకెళ్లి హెచ్‌ఎం, టీచర్లను విచారణ చేసి డీఈఓకు నివేదించారు. కార్యక్రమంలో ఎంఈఓ గోపాల్‌నాయక్ పాల్గొన్నారు.