Bookkeeping
-
మన క్రికెటర్లు అవగాహనాపరులు
న్యూఢిల్లీ: బెట్టింగ్ ముఠాల కార్యకలాపాలు, బుకీల సంప్రదింపులపై భారత క్రికెటర్లు జాగరూకతతో వ్యవహరిస్తారని బీసీసీఐ అవినీతి నిరోధక యూనిట్ (ఏసీయూ) చీఫ్ అజిత్ సింగ్ అన్నారు. ఈ అంశంపై వారికి తగినంత అవగాహన ఉందని పేర్కొన్నారు. ఏదైనా అసాధారణంగా అనిపిస్తే వెంటనే తమకు రిపోర్ట్ చేస్తారని చెప్పారు. ‘సామాజిక మాధ్యమాలు, ఆన్లైన్ ద్వారా బుకీలు ఎలా సంప్రదింపులు జరుపుతారనే అంశంపై మన క్రికెటర్లకు పూర్తిగా అవగాహన కల్పించాం. వారికి నేరం జరిగే తీరుపై అవగాహన ఉంది. ఎవరైనా తమను సంప్రదించినప్పుడు వారు వెంటనే మా దృష్టికి తీసుకువస్తారు. మా ఏసీయూ టీమ్ ఎప్పటికప్పుడు ఆటగాళ్ల సోషల్ మీడి యా అకౌంట్లపై, ఆన్లైన్ కాంటాక్ట్‌లపై కన్నేసి ఉంచుతుంది. ఫేక్ ఐడీలతో అభిమానులుగా చెలామణి అయ్యేవారి నిజస్వరూపం ఏదో ఒక సమయంలో బయటపడుతుంది’ అని అజిత్ వివరించారు. -
ఉపాధ్యాయురాలి తోసివేత
బుక్కపట్నం (పుట్టపర్తి) : తోటి ఉపాధ్యాయురాలిని మరో ఉపాధ్యాయురాలు తోసివేసింది. కిందపడిన ఉపాధ్యాయురాలు అపస్మారకస్థితికి చేరుకుంది. వివరాలిలా ఉన్నాయి. బుక్కపట్నం మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఆదేశాల మేరకు ‘విద్యార్థుల చదువు, ఎదుగు’ కార్యక్రమం చేపట్టారు. మంగళవారం ఉదయం ఇంగ్లిష్ సబ్జెక్టు టీచర్ వరలక్ష్మి ఆలస్యంగా పాఠశాలకు వచ్చారు. ఆమెను హెచ్ఎం రాధాశ్రీదేవి తన చాంబర్‌కు పిలిపించి వివరణ కోరారు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన వైజయంతి అనే మరో టీచర్ ఏం జరిగిందో తెలియదుగానీ ఉన్నపళంగా వరలక్ష్మిని కిందకు తోసేశారు. దీంతో ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్లారు. కాసేపటి తర్వాత తేరుకున్న వరలక్ష్మి సెలవు పెట్టి ఇంటికెళ్లిపోయారు. అనంతరం ఆమెను కుటుంబ సభ్యులు అనంతపురం ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం కోలుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయంపై హెచ్ఎం, సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై డీఈఓ లక్ష్మీనారాయణ డైట్ కళాశాల ప్రిన్సిపల్ జనార్ధన్‌రెడ్డిని విచారణకు ఆదేశించారు. ఈ మేరకు డైట్‌కళాశాల ప్రిన్సిపల్ పాఠశాలకెళ్లి హెచ్ఎం, టీచర్లను విచారణ చేసి డీఈఓకు నివేదించారు. కార్యక్రమంలో ఎంఈఓ గోపాల్‌నాయక్ పాల్గొన్నారు. -
స్కూల్ అసిస్టెంట్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
బుక్కపట్నం : స్థానిక డైట్ కళాశాలలో ఫిలాసఫీ, సోషియాలజీ సబ్జెక్టులకు సంబంధించి డెప్యూటేషన్‌పై పనిచేయుటకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు సోమవారం లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ జనార్దన్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయలు పీజీ చేసి ఆయా సబ్జెక్టుల్లో ఎం.ఈడీ చేసి ఉండాలన్నారు.