పుట్టపర్తి రూరల్ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లా పుట్టపర్తి రూరల్ మండలం కప్పలబండలో ఆదివారం ఉదయం అప్పులబాధతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శివశంకర్(40, నాగలీల(35) దంపతులు గొర్రెలను మేపుకుని జీవనం సాగించేవారు.
అప్పులబాధతో దంపతులు ఆదివారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయం విగతజీవులై పడి ఉన్న వీరిని చూసిన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.