పుట్టపర్తిలో మావోయిస్టుల కోసం దాడులు నిర్వహించిన మాట వాస్తవమేనని అనంతపురం ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు.
అనంతపురం : పుట్టపర్తిలో మావోయిస్టుల కోసం దాడులు నిర్వహించిన మాట వాస్తవమేనని అనంతపురం ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు. ఒడిశా పర్యాటక శాఖ మంత్రి మహేశ్వరీ మహంతిపై దాడి కేసులో నలుగురు అనుమానితులను ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారని, వారికి తాము సహకరించినట్లు ఆయన తెలిపారు. అదుపులోకి తీసుకున్న నలుగురిని ఒడిశాకు తరలించినట్లు సెంథిల్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 21న ఒడిశా మంత్రిపై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే.