
పుట్టపర్తిలో టీడీపీ నేత దౌర్జన్యం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ నారాయణరెడ్డిపై కోళ్ల రమణ మంగళవారం దాడి చేశాడు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ నేత దాడి చేసి నారాయణరెడ్డిని గాయపర్చాడు. దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే ప్రేక్షకపాత్ర వహించారు. పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.