
సాక్షి, అనంతపురం : ఎన్నికలొచ్చాయ్.. ఓటర్లు దేవుళ్లై పోయారు. వారిని ప్రసన్నం చేసుకోవడానికి రాజకీయ నాయకులు ఎన్నికల వేళ రకరకాల జిమ్మిక్కులు చేస్తుంటారు. ఆ వరుసలో ఏపీ సీఎం చంద్రబాబు ముందుంటారు. అయిదేళ్ల పాలనలో కనిపించని ప్రజలు ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఆయనకు ఒక్కసారిగా గుర్తుకు వచ్చారు. ఓవైపు హామీల నాటకాలకు తెరతీస్తూనే మరోవైపు ప్రచార వేదికలపై తెచ్చిపెట్టుకున్న ‘అనురాగం’ చూపిస్తున్నారు. మామూలుగా అయితే ఎవరినీ చేతితో కూడా తాకటానికి ఇష్టపడని చంద్రబాబు తాజాగా ఓ వృద్ధురాలి పట్ల ఎడతెగని ప్రేమ కురిపించేశారు.
ఓ అవ్వను సైకిల్‌పై ఎక్కించుకున్న చంద్రబాబు అక్కడున్నవారికి అభివాదం చేశారు. ఆమెను ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నారు. దీంతో బాబును దీవించేందుకు ఆ వృద్ధురాలు ఆయన తలపై చేతులు పెట్టగా.. ఆమె చేతులను బలవంతంగా తీసివేశారు. దీంతో ఖిన్నురాలైన పెద్దావిడ వదిలితే దిగిపోతా అన్నట్టు చూసింది. అంతలోనే.. ఇక చాలులే అన్నట్టు తెలుగు తమ్ముళ్లు ఆమెను సైకిల్ దించేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా పుట్టపర్తిలో జరిగిన బహిరంగ సభలో చోటుచేసుకున్న ఈ సన్నివేశం బాబు ఎన్నికల స్టంట్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. ఇప్పుడు సైకిల్ ఎక్కించుకుంటారు. గెలిచాక దానికిందే వేసి తొక్కిపడేస్తారు అని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment