
సాక్షి, అనంతపురం: జిల్లా పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. అనంతపురం జిల్లా మొత్తం వార్ వన్ సైడ్‌గా మారింది. ఇక పుట్టపర్తి నియోజకవర్గంలో ఆరు జెడ్పీటీసీ స్థానాలను అధికార పార్టీ సొంతం చేసుకుంది. నియోజకవర్గంలోని పుట్టపర్తి, ఆమడగూరు, ఓబులదేవచెరువు, కొత్తచెరువు, నల్లమాడ, బుక్కపట్నం జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది.
ఈ విజయంతో వైఎస్సార్‌సీపీ అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకన్నారు. సీఎం జగన్ సంక్షేమ పాలనను చూసి ప్రజలు భారీగా ఓట్లేశారని పేర్కొన్నారు. ప్రజారంజక పాలనకు మరోసారి ప్రజలు అఖండ విజయం అందించారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఇక ఎంపీటీసీ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలు వైఎస్సార్‌సీపీ సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment