క్లీన్ స్వీప్ దిశగా వైఎస్సార్‌సీపీ
సామాజిక సమీకరణలో సీట్ల కేటాయింపు
ఎన్నికల క్షేత్రంలో దూసుకుపోతున్న వైఎస్సార్‌సీపీ నేతలు
ఏ ప్రాంతానికి వెళ్లినా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు బ్రహ్మరథం
జనం చీదరించుకున్నా టీడీపీ పాత నేతలతోనే బరిలోకి
సాక్షి, ఒంగోలు ప్రతినిధి : ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ సీపీ క్లీన్‌స్వీప్ దిశగా దూసుకుపోతోంది. సామాజిక సమీకరణలను బేరీజు వేసుకొని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభ్యర్థులను రంగంలోకి దింపారు. ఐదేళ్లలో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు వైఎస్సార్‌సీపీ విజయానికి పునాదులుగా మారాయి. సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబి్ధదారుల ఖాతాల్లో వందల కోట్లు జమయ్యాయి. అదే సమయంలో వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడంతో ప్రజలు మరోసారి వైఎస్సార్ సీపీకి పట్టం కట్టనున్నారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు పనులు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే పూర్తయ్యాయి.
విజయ ‘భాస్కరు’డే
చెవిరెడ్డి భాస్కరరెడ్డి వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఎంపీఅభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి విస్తృతంగా పర్యటిస్తున్నారు. అందరినీ కలుపుకుంటూ మండలాల వారీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరో పక్క టీడీపీ తరఫున బరిలో ఉన్న మాగుంట శ్రీనివాసులరెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీ తరఫున పోటీ చేయడం మాగుంటకు రివాజుగా మారింది. తరచూ పార్టీలు మారడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. దీనికి తోడు దేశాన్ని కుదిపేస్తున్న మద్యం కుంభకోణంలో ఈయన కుమారుడు అప్రూవర్‌గా ఉన్నారు. ప్రజల మనిíÙగా పేరొందిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఎంపీగా భారీ విజయం దిశగా దూసుకుపోతున్నారు.
బాలినేనికి సిక్సర్ ఖాయం
బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నుంచి విడదీయరాని బంధం. ఇప్పటికే ఒంగోలు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండు విడతలు మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో గెలిచి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.230 కోట్లతో 25 వేల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చరిత్రలో నిలిచిపోనుంది. బాలినేనికి టీడీపీ అభ్యర్థి దామచర్ల ఏమాత్రం పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. ఒక్కసారి ఎమ్మెల్యేగా çగెలిచిన దామచర్ల ఆ ఐదేళ్లలో చేసిన అరాచకాలు, అవినీతి, అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ఎవరు పిలిచినా పలికే నేతగా పేరు తెచ్చుకున్న బాలినేని మళ్లీ విజయం సాధించి సిక్సర్ కొట్టనున్నారు.
దర్శి బూచేపల్లి అడ్డా
దర్శి టీడీపీ తరఫున నరసరావుపేటకు చెందిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి బరిలోకి దించింది. కానీ రెండు దశాబ్దాలుగా దర్శిని అడ్డాగా మార్చుకున్న బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి గొట్టిపాటి లక్ష్మి ఏ మాత్రం పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. ఏడాదిగా దర్శిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న బూచేపల్లి ఏ ఇంటికి వెళ్లినా తమ కుటుంబ సభ్యునిగా భావిస్తారు. నిజాయితీకి మారుపేరుగా ఉన్న బూచేపల్లి కుటుంబం ఈ విడత భారీ మెజారీ్టతో విజయం సాధిస్తుందంటున్నారు. గొట్టిపాటి లక్ష్మి కొత్త అభ్యర్థి కావడం, జనసేన, టీడీపీల నుంచి పలువురు టికెట్లు ఆశించి భంగపడిన వారు వెన్నుపోటుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
సంతనూతలపాడులో నాగా‘అర్జునుడే’
సంతనూతలపాడు నుంచి మంత్రి మేరుగు నాగార్జున బరిలో దిగుతున్నారు. ఇక్కడ మేరుగు కొత్త అయినా మంత్రిగా ఆయన అనుభవం మరోసారి విజయాన్ని అందించనుంది. 24 సంవత్సరాలుగా టీడీపీ జెండా ఎగురలేదని ఇటీవల చీమకుర్తిలో జరిగిన యువగళంలో కూడా లోకేశ్ తన ఆవేదనను వ్యక్తం చేశారు.టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్న బీఎన్ విజయకుమార్ ఇప్పటికే రెండు సార్లు ఓటమి పాలయ్యారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మంత్రి మేరుగు అనుభవం మరోసారి విజయాన్ని అందించనున్నాయి.
ఆదిమూలపుసురేష్ దూకుడు
కొండపి నుంచి ఈ సారి మంత్రి ఆదిమూలపు సురేష్ బరిలో దిగుతున్నారు. ఓటమి ఎరుగని నేతగా ఆయనకు పేరుంది. విద్యావంతుడిగా పేరుగాంచిన సురేష్‌కు కొండపిలో విజయం నల్లేరుపై నడకేనంటున్నారు. మరో వైపు టీడీపీ నుంచి ఎమ్మెల్యే స్వామి బరిలోకి దిగుతున్నారు. మరుగుదొడ్లు, నీరు–చెట్టు, ఇంకుడుగుంతల పథకాల్లో వందల కోట్ల అవినీతికి పాల్పడిన డోలా బాల వీరాంజనేయస్వామికి ఈ విడత ఘోరంగా ఓటమి ఖాయమంటున్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారం సందర్భంగా అనంతవరం, కొణిజేడు గ్రామాల్లో ఎదురైన చేదు అనుభవాలే స్వామి ఓటమిని ఖరారు చేశాయి.
గిద్దలూరు గెలుపు తథ్యం
వైఎస్సార్‌సీపీకి గిద్దలూరు కంచుకోట. 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో 80 వేల మెజారీ్టతో రాష్ట్రంలో గిద్దలూరు నియోజకవర్గం సంచలనం సృష్టించింది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరపున గెలిచిన ముత్తుల అశోక్‌రెడ్డి పార్టీ ఫిరాయించి పారీ్టకి నమ్మకద్రోహం చేశాడని నియోజకవర్గంలో అతనిపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ విడత ముత్తుముల బరిలో ఉన్నా అతన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వైఎస్సార్‌సీపీ నుంచి బరిలో ఉన్న కేపీ నాగార్జునరెడ్డి ఉన్నత విద్యావంతుడు, మృదుస్వభావి. వైఎస్సార్‌సీపీ ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు ఇంటింటికి చేరాయి. దీంతో కేపీ నాగార్జునరెడ్డి గెలుపు నల్లేరుపై నడకే.
మార్కాపురంలో ప్రభంజనమే
గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యరి్థగా అన్నా రాంబాబు మార్కాపురం నుంచి బరిలో దిగుతున్నారు. గత ఎన్నికల్లో 80 వేల మెజారిటీ సాధించిన చరిత్ర ఆయనది. విద్యాదాతగా అన్నా రాంబాబు పేరుగడించారు. పేద విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు చారిటబుల్ ట్రస్టు ద్వారా పేదలకు సేవ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డిపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. 13 క్రిమినల్ కేసులతో పాటు భూకబ్జాలు, అనేక ఆరోపణలు ఉండటంతో ఆయన 2014, 2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యాడు. దీంతో అన్నా రాంబాబుకు మరోసారి భారీ మెజార్టీ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కనిగిరిలో కొత్త చరిత్ర
దద్దాల నారాయణ యాదవ్ వైఎస్సార్‌సీపీ కనిగిరి నుంచి చరిత్ర సృష్టించనున్నారు. సామాన్యుడికి టికెట్ కేటాయించి జగనన్న టీడీపీ అభ్యర్థి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డిపై పోటీకి దించారు. దద్దాలపై కనిగిరి ప్రజలకు ఎనలేని అభిమానం ఉంది. టీడీపీ అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి అధికారంలో ఉన్న సమయంలో పాల్పడిన కక్ష సాధింపు చర్యలను ప్రజలు మరిచిపోలేకపోతున్నారు. దీనికి తోడు టీడీపీ బీజేపీ కూటమిలో ఉండటంతో ముస్లింలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. నియోజకవర్గంలో సుమారు 22,500 ఓట్లు ఉన్న ముస్లింలు దద్దాల వైపే ఉన్నారు. దీంతో ఇక్కడ ఆయన విజయం తథ్యమంటున్నారు.
యర్రగొండపాలెం ఏకపక్షం
యర్రగొండపాలెం ఎప్పుడూ ఏకపక్షమే. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న టీడీపీ ఎరిక్షన్‌బాబు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్‌కు ఏమాత్రం పోటీ ఇచ్చే అవకాశం లేదు. లిడ్‌క్యాప్ చైర్మన్‌గా పనిచేసిన కాలంలో ఎరిక్షన్‌బాబుపై తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయి. తాటిపర్తి చంద్రశేఖర్ కొత్త వ్యక్తే అయినప్పటికీ గత మూడు నెలలుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ప్రజలకు చాలా దగ్గరయ్యారు. ఈ పరిస్థితుల్లో తాటిపర్తి భారీ మెజారిటీతో విజయం సాధించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment