అనంతపురం జిల్లాలోని పుట్టపర్తిలో ఓ ఘరానామోసం వెలుగుచూసింది.
అనంతపురం జిల్లాలోని పుట్టపర్తిలో ఓ ఘరానామోసం గురువారం వెలుగుచూసింది. ఆస్ట్రేలియాకు చెందిన గాయాస్టార్ స్థాపించిన సాయిప్రశాంతి ట్రస్ట్ ఆక్రమణకు గురైనట్టు తెలిసింది. సాయిప్రశాంతి ట్రస్ట్కు చెందిన ఆస్తులను శ్రీనివాస్ అనే వ్యక్తి ఆక్రమించినట్టు తెలుస్తోంది.
అతనికి మద్దతుగా మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత గంగన్నలు ఉన్నట్టు ఆరోపణలు వెలువెత్తాయి. ఈ నేపధ్యంలో ట్రస్ట్ ఆక్రమణ విషయమై పీఎమ్ఓకు, అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దాంతో శ్రీనివాస్పై చీటింగ్ కేసు నమోదు చేసినట్టు బుక్కపట్నం పోలీసులు తెలిపారు.