అనంతపురం : అనంతపురం జిల్లా పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి బాబా ఆరాధనోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమైనాయి. ఈ ఆరాధనోత్సవాల్లో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యాజ్యోతి పథకాన్ని ప్రారంభించారు.అనంతరం వెంకయ్య మాట్లాడుతూ... సత్యసాయిబాబా సేవలు అభినందనీయమన్నారు. విద్యా, వైద్య రంగాల్లో ఈ ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాలు గర్వకారణమని వెంకయ్య పేర్కొన్నారు.