అనంతపురం: పుట్టపర్తిలో దారుణ హత్యకు గురైన ఆస్ట్రేలియా మహిళ టోనీ బేయిర్ కేసును అనంతపురం జిల్లా పోలీసులు ఛేదించారు. శనివారం అనంతపురంలో జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... బేయిర్ హత్య కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు శనివారం అనంతపురంలో వెల్లడించారు. కేవలం డబ్బు కోసమే వారు ఆమెను హత్య చేశారని తెలిపారు. నిందితుల వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
పుట్టపర్తిలోని అన్ని ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. అలాగే పట్టణంలోని అన్ని అపార్ట్మెంట్లు, దుకాణాలలో సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని ఆయన పుట్టపర్తి వాసులకు సూచించారు. పుట్టపర్తికి వచ్చే విదేశీయులకు అన్ని విధాల భద్రత కల్పిస్తామన్నారు. అందుకోసం అవసరమైతే సత్యసాయి ట్రస్ట్ సహకారం కూడా తీసుకుంటామన్నారు. ఎక్కడ బస చేస్తున్నారో ముందుగా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఈ సందర్బంగా విదేశీయులకు ఎస్పీ రాజశేఖరబాబు విజ్ఞప్తి చేశారు.
డబ్బు కోసమే ఆస్ట్రేలియా మహిళ హత్య
Published Sat, Nov 8 2014 12:57 PM | Last Updated on Sat, Sep 2 2017 4:06 PM
Advertisement
Advertisement