'తల్లి రాక్షసి'పై పోలీసుల కేసు నమోదు | Australian woman charged for murdering eight kids | Sakshi
Sakshi News home page

'తల్లి రాక్షసి'పై పోలీసుల కేసు నమోదు

Published Sun, Dec 21 2014 11:11 AM | Last Updated on Wed, Sep 26 2018 3:36 PM

'తల్లి రాక్షసి'పై పోలీసుల కేసు నమోదు - Sakshi

'తల్లి రాక్షసి'పై పోలీసుల కేసు నమోదు

కాన్బెర్రా: కన్న బిడ్డలను అత్యంత కిరాతకంగా హత్య చేసిన మహిళ మెర్సెన్ వారియా (37) పై కేసు నమోదు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి జిమ్ మాంటెగ్యు ఆదివారం వెల్లడించారు. ఈ హత్యలన్నీ ఆమె చేసిందని తాము ధృవీకరించినట్లు చెప్పారు.  ఈ కేసును సోమవారం కెయిర్న్స్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు. ప్రస్తుతం నిందితురాలు మెర్సెన్... ఆసుపత్రిలో కోలుకుంటుందని పేర్కొన్నారు. అంతకు మించి సమాచారం మాత్రం తాను ఇవ్వలేనని మాంటెగ్యు స్పష్టం చేశారు.

కెయిర్న్స్ పట్టణానికి చెందిన మెర్సెన్ వారియా తన ఏడుగురు చిన్నారులతోపాటు మేనకోడలైన మరో చిన్నారినీ శుక్రవారం హత్య చేసింది. అంతేకాకుండా ఆమెకు ఛాతీ, మెడపైనా గాయాలు ఉన్నాయి. వారియాకు ఐదుగురు భర్తలు ఉన్నారు. వారి ద్వారా ఈ మృతి చెందిన ఏడుగురు పిల్లలు జన్మించారు.

పిల్లల మృతి వారి తండ్రులకు సమాచారం అందిస్తున్నామని చెప్పారు. చనిపోయిన వారంతా ఏడాదిన్నర నుంచి 14 ఏళ్లలోపు వారేనన్న విషయం తెలిసిందే. ఈ హత్యాకాండను మెర్సెన్ శుక్రవారం  చేసిందని పోలీసులు భావిస్తున్నారు.  మెర్సెన్ ను శనివారమే పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement