australian woman
-
ప్రాంక్ అని చెప్పి నిజమైన పెళ్లి..
రీల్స్, ఇన్‌స్ట్రాగామ్ ప్రపంచాన్ని ఏలుతున్న కాలంలో ఏది నిజమో? ఏది అబద్ధమో? తెలియడం లేదు. ఆ్రస్టేలియాలోని ఓ మహిళకు ఇలాంటి సమస్యే ఎదురైంది. సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌ను పెంచుకోవడానికి అతను ఏర్పాటు చేసిన ‘ఫేక్ వెడ్డింగ్’నిజమని తేలడంతో ఆమె కోర్టుకెక్కాల్సి వచ్చింది. చివరకు జడ్జి ఆ పెళ్లిని రద్దు చేశారు. వివరాల్లోకి వెళ్తే... మెల్బోర్న్లో ఉంటున్న ఓ మహిళకు 2023 సెప్టెంబర్‌లో ఆన్లైన్ డేటింగ్ వేదికపై ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అది కాస్తా ప్రేమగా మారింది. అదే ఏడాది డిసెంబర్లో ఆమెకు అతను ప్రపోజ్ చేశాడు. ఆమె అంగీకరించింది. రెండు రోజుల తర్వాత సిడ్నీలో ఓ వైట్పార్టీ ఉందని, అక్కడికి అందరూ తెలుపు రంగు దుస్తుల్లో వస్తారని చెప్పారు. ఆమె కూడా అలాగే రెడీ అయి వెళ్లింది. తీరా అక్కడికెళ్లి చూస్తే.. ఫోటోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్ స్నేహితుడు తప్ప మరెవరూ లేరు. ఇదేంటని ప్రశ్నిస్తే... తన ఇన్‌స్ట్రాగామ్‌లో ఫాలోవర్స్ పెరగడం కోసం ప్రాంక్ వెడ్డింగ్ నిర్వహిస్తున్నానని, అందుకు సహకరించాలని ఆమెను కోరాడు. అప్పటికే అతనికి 17,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. అతని వివరణ ఆమెకు సబబుగానే తోచింది. సాయం చేసినట్లవుతుందని ఫేక్ పెళ్లికి అంగీకరించింది. సివిల్ మ్యారేజ్ కోర్టులో జరిగితేనే పెళ్లి చెల్లుబాటవుతుందని నమ్మింది. అదే విషయాన్ని తన స్నేహితురాలితో పంచుకుంది. అదే నిజమైతే వారు ముందుగా వివాహం నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని స్నేహితురాలు కూడా చెప్పడంతో.. ఇది ఉత్తుత్తి పెళ్లే అని నమ్మింది. కట్ చేస్తే.. రెండు నెలల తరువాత, ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం కోసం ఆమె చేసిన దరఖాస్తులో తనను డిపెండెంట్‌గా చేర్చాలని అతను కోరాడు. పెళ్లి కానిది ఎలా కుదురుతుందని ఆమె ప్రశ్నించగా.. సిడ్నీలో జరిగిన వివాహ వేడుక నిజమైనదని బాంబు పేల్చాడు. వివాహ ధృవీకరణ పత్రాన్ని కూడా చూపించాడు. ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి.. వివాహానికి నెలముందే అతను నోటీసులు ఇచ్చాడని అర్థమైంది. అతను మొదటినుంచి అబద్ధం చెప్పాడని, తనను మోసం చేశాడని ఆమె కోర్టుకెక్కింది. పెళ్లి వేడుకలో తాను నటించానే తప్ప.. అది నిజం కాదని కోర్టుకు తెలిపింది. మహిళ వాంగ్మూలాన్ని నమ్మిన మెల్బోర్న్ జడ్జి 2024 అక్టోబర్‌లో వీరి వివాహాన్ని రద్దు చేస్తూ తీర్పు ఇచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Kathleen Folbigg: కన్నబిడ్డల మృతి కేసులో ఆస్ట్రేలియా మహిళ.. 20 ఏళ్లకు విముక్తి
సిడ్నీ: కన్నబిడ్డల మృతి కేసులో 20 ఏళ్లపాటు కారాగారంలో మగ్గిన ఆf స్ట్రేలి యా మహిళకు ఎట్టకేలకు విముక్తి లభించింది.న్యూ సౌత్ వేల్స్ లోని క్రిమినల్ కోర్టు ఆదేశాలతో గురువారం ఆమె విడుదలయ్యారు. కాథ్లీన్ ఫాల్బిగ్కు జన్మించిన నలుగురు సంతానం 1989–1999 సంవత్సరాల మధ్య వివిధ కారణాలతో చనిపో యారు. అయితే, వారి మరణాలకు తల్లి కాథ్లీనే కారణమంటూ పోలీసులు 2003లో హత్య కేసు నమోదు చేసి, జైలు శిక్ష విధించారు. తాను అమాయకురాలినని, తన బిడ్డల మరణాలు సహజంగానే జరిగినవని ఆమె ఎంతగా చెప్పినా ఎవరూ వినలేదు. మీడియా ఆమెను వరస్ట్ ఫిమేల్ సీరియల్ కిల్లర్‌గా అభివర్ణించింది. 2019లో మరోసారి జరిగిన దర్యాప్తులోనూ ఆమెనే దోషిగా తేలింది. 2022లో మాజీ న్యాయాధికారి జరిపిన విచారణలో మాత్రం..చనిపోయిన నలుగురు బిడ్డల్లో ఇద్దరు జన్యు సంబంధ వ్యాధులతోనే చనిపోయి ఉండొచ్చంటూ తెలిపింది. దీంతో, ఈ ఏడాది జూన్‌లో ఆమెకు కోర్టు క్షమాభిక్ష ప్రకటించింది. ఆమెపై వచ్చిన ఆరోపణలను న్యూ సౌత్ వేల్స్ కోర్టు కొట్టివేస్తూ జైలు నుంచి విడుదల చేసింది. జైలు నుంచి విడుదలైన కాథ్లీన్ ఫాల్బిగ్ హర్షం వ్యక్తం చేశారు. 1999లోనే తనపై మోపిన ఆరోపణలకు జవాబులు దొరికినా, నిరపరాధినని నిరూపించుకోలేకపోయాను. పిల్లలు ఆకస్మికంగా, గుర్తు తెలియని కారణాలతో చనిపోయే అవకాశం ఉందని భావించని యంత్రాంగం నన్ను దోషిగా చూసింది’అని పేర్కొన్నారు. రెండు దశాబ్దాలపాటు తనను నిర్బంధించిన యంత్రాంగం నుంచి భారీగా పరిహారం కోరుతూ దావా వేస్తానన్నారు. ఫాల్బిగ్ను విడుదల చేయాలంటూ పలువురు వైద్య నిపుణులు, వైద్యులు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను సైతం చేపట్టారు. -
యాదాద్రిలో ఒక్కటైన తెలుగబ్బాయి.. తెల్లమ్మాయి
సాక్షి, యాదాద్రి(ఆలేరు) : హైదరాబాద్ అబ్బాయి.. ఆస్ట్రేలియా అమ్మాయి యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహస్వామి సాక్షిగా సోమవారం ఒక్కటయ్యారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌కు చెందిన దుశ్యంత్ అనే యువకుడు ఆరేళ్ల క్రితం ఉద్యోగ నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తుండగా స్థానికంగా ఉంటు న్న రీమా అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ విషయం ఇద్దరి కుటుంబీకులకు తెలియడంతో తొలుత విముఖత చూపినా తర్వాత ఒప్పుకున్నారు. ఇద్దరి కుటుంబ సభ్యులు గు ట్టలో పెళ్లి జరిపించారు. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహతంతు అనంతరం ఆస్ట్రేలియా సంప్రదాయం ప్రకారం ఉంగరాలు మార్చుకున్నారు. మనసులు కలవడానికి ఖండాంతరాలు అడ్డుకావని ఈ జంట నిరూపించింది. -
మహిళ మృతిపై ఆస్ట్రేలియా ప్రధాని దిగ్బ్రాంతి
వాషింగ్టన్: ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్ చేసిన పాపానికి పోలీసుల కాల్పుల్లో తమ దేశ మహిళ ప్రాణాలు కోల్పోయిన విషాదంపై ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్ విచారం వ్యక్తం చేశారు. ఇది నిజంగానే షాకింగ్, అవాంఛనీయ దుర్ఘటన అని ప్రధాని పేర్కొన్నారు. బాధితురాలి కుటుంబానికి క్షమాపణ చెప్పడం తప్ప చేసేదేం లేదన్నారు. 'జూనియర్ పోలీసు కాల్పుల్లో మహిళ ప్రాణాలతో బయటపడి ఉండే బాగుండేది. నిస్సహాయురాలైన మహిళపై ఆయుధాలతో కాల్పులకు పాల్పడి మా పోలీసు తప్పిదం చేశారని' మిన్నెపోలీస్ చీఫ్ జేన్ హార్ట్యూ అన్నారు. అసలేం జరిగిందంటే.. అస్ట్రేలియాకు చెందిన జస్టిన్ రస్జెక్ అనే 40 ఏళ్ల మహిళ గడ మూడేళ్లుగా అమెరికాలోని మిన్నెపోలిస్‌లో నివాసం ఉంటున్నారు. ఇటీవల స్థానిక వ్యాపారి డాన్ డామండ్(50) తో ఎంగేజ్మెంట్ జరిగింది. మరికొన్ని రోజుల్లో ఈ జంట వైవాహిక జీవితంలో అడుగుపెట్టనుంది. అయితే గత శనివారం (జూలై 15న) రాత్రి రస్జెక్ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో పొరుగింట్లో ఏదో గొడవ జరగడంతో ఎమర్జెన్సీ నెంబర్ 911కు కాల్ చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న బృందంలోని ఓ మహిళా పోలీసు తమ వాహనంలోంచి ఓ ఇంటి కిటికీ వైపు కాల్పులు జరిపింది. కిటికీ పక్కనే ఉన్న రస్జెక్ కు బుల్లెట్ తగిలి కుప్పకూలి చనిపోయింది. ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని గుర్తించిన డాన్ డామండ్, అతడి కుమారుడు జక్ డామండ్ లు కన్నీరు మున్నీరయ్యారు. చుట్టుపక్కల వాళ్లను డామండ్ సంప్రదించగా పోలీసులు కాల్పులు జరపడంతో రస్జెక్ చనిపోయి ఉండొచ్చునని జరిగిన విషయాన్ని చెప్పారు. దీనిపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయగా, కాల్పులకు పాల్పడ్డ మహిళా పోలీసు తన తప్పును అంగీకరించారు. రస్జెక్ కు కాబోయే భర్త డాన్ డామండ్కు క్షమాపణ చెప్పారు. కాల్ అందిన వెంటను అక్కడికి వెళ్లగా.. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తివైపు కాల్పులు జరపగా ఈ విషాదం జరిగినట్లు వివరణ ఇచ్చుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. -
ఆస్ట్రేలియా మహిళ ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్చేస్తే..
వాషింగ్టన్: ఓ మహిళ ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్ చేసిన పాపానికి, పోలీసుల కాల్పుల్లో తన ప్రాణాలే కోల్పోయింది. ఈ విషాదకర ఘటన అమెరికాలోని సౌత్ మిన్నెపోలిస్‌లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబం వివరాల మేరకు.. ఆస్ట్రేలియాకు చెందిన జస్టిన్ రస్జెక్ అనే 40 ఏళ్ల మహిళ గడ మూడేళ్లుగా అమెరికాలోని మిన్నెపోలిస్‌లో నివాసం ఉంటోంది. ఇటీవల ఆమె ఎంగేజ్మెంట్ అయింది. వచ్చే నెలలో అమెరికా వ్యాపారవేత్త డాన్ డామండ్(50) తో ఆమె వివాహం జరగనుంది. ఇంతలోనే విషాదం జరిగిందని డామండ్ కుమారుడు జక్ డామండ్ వాపోయాడు. శనివారం జస్టిన్ రస్జెక్ ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. తమ పక్కింట్లో ఏదో గొడవ జరుగుతోందని త్వరగా రావాలంటూ ఎమర్జెన్సీ నెంబర్ 911కు రాత్రి 11 గంటలకు ఆమె కాల్ చేశారు. అరగంట తర్వాత పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పెద్ద శబ్దాలు వస్తున్న వైపుగా వెళ్లిన ఇద్దరు పోలీసుల్లో ఒకరు తుపాకీతో కాల్పులు జరిపారు. కాల్పులు తర్వాత అక్కడ ఎలాంటి అనుమానిత వ్యక్తులు కనిపించకపోవడంతో వారు వెళ్లిపోయారు. ఆదివారం కుమారుడు జక్తో పాటు డాన్ డామండ్ ఇంటికి వెళ్లిచూడగా రస్జెక్ రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉంది. చుట్టుపక్కల వాళ్లను పిలవగా శనివారం రాత్రి ఇంటి సమీపంలో పోలీసులు కాల్పులు జరిపి వెళ్లిపోయారని చెప్పారు. పోలీసుల తొందరపాటు కారణంగా తాను తల్లి, ఓ మంచి స్నేహితురాలును కోల్పోయినట్లు జక్ డామండ్ కన్నీటిపర్యంతమయ్యాడు. తనకు మద్దతుగా పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పాలని విజ్ఞప్తి చేశాడు. పోలీసుల నుంచి తనకు జవాబులు రావాలని, జరిగిన నష్టానికి బాధ్యులు ఎవరో తేలాల్సి ఉందని జక్ డామండ్ పేర్కొన్నాడు. -
పార్క్‌లో భారతీయ కుటుంబానికి అవమానం
సిడ్నీ: ఆస్ట్రేలియాలో భారతీయులపై మరో జాతి వివక్ష సంఘటన చోటుచేసుకుంది. గర్భవతి అయిన తన భార్యను కాస్తంత పక్కన కూర్చొబెట్టుకుంటారా అని అడిగినందుకు ఉత్సవ్ పటేల్ అనే భారతీయుడు, అతడి కుటుంబానికి సిడ్నీలో చేదు అనుభవం ఎదురైంది. ఆ సిడ్నీ మహిళ అతడిని, భారతీయులను, భారత్‌ను అనకూడని మాటలతో ద్వేషించింది. వారి నాలుగేళ్ల కూతురు భయంతో చూస్తుండగా జాతి వివక్ష పూరిత వ్యాఖ్యలు చేసింది. దీనిని ఉత్సవ్ తన కెమెరాలో రికార్డు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన ఏప్రిల్ 22న సిడ్నీలోని లూనా పార్క్‌లో చోటు చేసుకోగా తాజాగా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతోంది. ఉత్సవ్ తెలిపిన వివరాల ప్రకారం పార్క్‌లో రైడింగ్ చేసేందుకు తన నాలుగేళ్ల కూతురు గర్భవతి అయిన భార్యతో కలసి వెళ్లాడు. అయితే, తన భార్య గర్భవతి కావడంతో కొద్ది సేపు వాకింగ్ చేసి తర్వాత అతడు రైడింగ్‌కు వెళ్లొచ్చేవరకు ఒక బెంచిపై కూర్చొబెట్టాలని అనుకున్నాడు. అప్పటికే దానిపై ఓ ఆస్ట్రేలియన్ మహిళ ఉండటంతో ఆమెను కాస్తంత కూర్చొబెట్టుకుంటారా అని అడిగినందుకు ఆమె అనకూడని మాటలు అనేసింది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోండి.. గో..గో..గో అంటో గోల చేసింది. తనకు భారతీయులంటే అస్సలు ఇష్టం లేదంటూ గట్టిగా అరిచింది. దీనిపై విచారణ వేగంగా సాగుతోంది. -
ఐఫోన్-7 చార్జింగ్ పెట్టి పడుకోగా..!
కొత్తగా వచ్చిన యాపిల్ ఐఫోన్-7 ఓ మహిళకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఐఫోన్ కు చార్జింగ్ పెట్టి ఆదమరిచి నిద్రించిన ఆమె తీవ్ర కాలిన గాయాలయ్యాయి. దీంతో పడుకునేటప్పుడు సెల్ ఫోన్ లను దూరంగా పెట్టాలని, ముఖ్యంగా చార్జింగ్ పెట్టి ఎంతమాత్రం వాడటం, పడుకొనేముందు పక్కన పెట్టడం సరికాదని హెచ్చరిస్తూ ఆమె ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టారు. దీంతోపాటు ఐఫోన్ వల్ల తన చేతికి తీవ్రంగా కాలిన గాయాలైన ఫొటోను పోస్టు చేశారు. మెల్ బోర్న్ కు చెందిన మేలెనీ టాన్ పీలెజ్ కు ఈమేరకు చేదు అనుభవం ఎదురైందని సిడ్నీ హెరాల్డ్ పత్రిక తెలిపింది. "ఇటీవల నేను ఐఫోన్-7ను కొన్నాను. అనుకోకుండా ఫోన్ కు చార్జింగ్ పెట్టి దానిని చేతిలో పట్టుకొని నిద్రపోయాను. ఏదో తీవ్ర నొప్పిగా ఉంటే లేచి చూశాను. చెయ్యికి తీవ్రంగా కాలిన గాయాలు కావడంతో నేను విస్తుపోయాను. ఒక్కక్షణం ఊపిరి ఆగినంత పని అయింది' అని మెలెనీ తన ఫేస్ బుక్ పోస్టులో తెలిపింది. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఐఫోన్ పట్ల ఇప్పటివరకు తనకు ఎలాంటి ఫిర్యాదులు లేవని, కానీ, తనకు ఇలాంటిది జరగడంతో ఇతరులకు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యే అవకాశముందని, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించింది. -
వెతికి మరీ ఆమె స్పెర్మ్ డోనర్‌ను పెళ్లాడింది!
ఓ ఆస్ట్రేలియా మహిళ సుదీర్ఘంగా అన్వేషించి మరీ స్పెర్మ్ డోనర్‌ను పెళ్లాడింది. తనకు మొదటి బిడ్డ పుట్టడానికి వీర్యదానం చేసిన వ్యక్తిని జీవిత భాగస్వామిని చేసుకుంది. బ్రిటన్‌లో జన్మించి ఆ తర్వాత ఆస్ట్రేలియా పౌరసత్వం పొందిన అమిన్హా హర్ట్ తన అనుభవాలతో ఇటీవల ఓ పుస్తకం రాసింది. తనకు వీర్యదానం చేసేందుకు ముందుకొచ్చిన వారి జాబితాలో స్కాట్ అండర్సెన్ అనే 45 ఏళ్ల రైతును ఆమె ఎంపిక చేసింది. తాను సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నానని అతను చెప్పడంతో అతన్ని అంగీకరించింది. ఇన్విట్రో ఫర్టిలైజేషన్ (ఐవీఎఫ్) ద్వారా ఈ జంటకు లీల అనే కూతురు జన్మించింది. ఐవీఎఫ్ విధానంలో మానవ శరీరం బయటే అండాన్ని వీర్యం ద్వారా ఫలదీకరణ చేస్తారు. లీలా జన్మించిన తర్వాత వీర్యదానం చేసిన స్కాట్ ఎక్కడున్నాడని హర్ట్ ఆరా తీసింది. చివరకు ఐవీఎఫ్ ఆస్పత్రి ద్వారా అతని వివరాలు కనుక్కుంది. తమకు పుట్టిన బిడ్డ అచ్చం తనలాగే ఉండటంతో స్కాట్ ఆశ్చర్యపోయాడు. 'చిన్నారి ఎలా ఉందో చూడాలని ఉండటంతో మొదట ఆమెను కలిశాను. ఆ తర్వాత ఆమె పట్ల నాలో ప్రేమ మొదలైంది' అని స్కాట్ చెప్పాడు. నిజానికి గతంలో ఇద్దరు వ్యక్తులతో ఆమె అనుబంధం నెరిపింది. ఈ ఇద్దరి ద్వారా పుట్టిన ఇద్దరు పిల్లలు చిన్నవయస్సులోనే ప్రాణాలు విడిచారు. తనకు జన్యుపరమైన సమస్య ఉండటం వల్ల ఇలా జరిగింది. ఒకవేళ తనకు ఓ బిడ్డ ఉండి ఉంటే తాను వీర్యదాత కోసం, ఐవీఎఫ్ విధానం కోసం ప్రయత్నించేదానిని కాదని హర్ట్ తెలిపింది. ఆమె జీవితకథ త్వరలోనే సినిమాగా వచ్చే అవకాశం కనిపిస్తోంది. -
వెతికి మరీ ఆమె స్పెర్మ్ డోనర్‌ను పెళ్లాడింది!
ఓ ఆస్ట్రేలియా మహిళ సుదీర్ఘంగా అన్వేషించి మరీ స్పెర్మ్ డోనర్‌ను పెళ్లాడింది. తనకు మొదటి బిడ్డ పుట్టడానికి వీర్యదానం చేసిన వ్యక్తిని జీవిత భాగస్వామిని చేసుకుంది. బ్రిటన్‌లో జన్మించి ఆ తర్వాత ఆస్ట్రేలియా పౌరసత్వం పొందిన అమిన్హా హర్ట్ తన అనుభవాలతో ఇటీవల ఓ పుస్తకం రాసింది. తనకు వీర్యదానం చేసేందుకు ముందుకొచ్చిన వారి జాబితాలో స్కాట్ అండర్సెన్ అనే 45 ఏళ్ల రైతును ఆమె ఎంపిక చేసింది. తాను సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నానని అతను చెప్పడంతో అతన్ని అంగీకరించింది. ఇన్విట్రో ఫర్టిలైజేషన్ (ఐవీఎఫ్) ద్వారా ఈ జంటకు లీల అనే కూతురు జన్మించింది. ఐవీఎఫ్ విధానంలో మానవ శరీరం బయటే అండాన్ని వీర్యం ద్వారా ఫలదీకరణ చేస్తారు. లీలా జన్మించిన తర్వాత వీర్యదానం చేసిన స్కాట్ ఎక్కడున్నాడని హర్ట్ ఆరా తీసింది. చివరకు ఐవీఎఫ్ ఆస్పత్రి ద్వారా అతని వివరాలు కనుక్కుంది. తమకు పుట్టిన బిడ్డ అచ్చం తనలాగే ఉండటంతో స్కాట్ ఆశ్చర్యపోయాడు. 'చిన్నారి ఎలా ఉందో చూడాలని ఉండటంతో మొదట ఆమెను కలిశాను. ఆ తర్వాత ఆమె పట్ల నాలో ప్రేమ మొదలైంది' అని స్కాట్ చెప్పాడు. నిజానికి గతంలో ఇద్దరు వ్యక్తులతో ఆమె అనుబంధం నెరిపింది. ఈ ఇద్దరి ద్వారా పుట్టిన ఇద్దరు పిల్లలు చిన్నవయస్సులోనే ప్రాణాలు విడిచారు. తనకు జన్యుపరమైన సమస్య ఉండటం వల్ల ఇలా జరిగింది. ఒకవేళ తనకు ఓ బిడ్డ ఉండి ఉంటే తాను వీర్యదాత కోసం, ఐవీఎఫ్ విధానం కోసం ప్రయత్నించేదానిని కాదని హర్ట్ తెలిపింది. ఆమె జీవితకథ త్వరలోనే సినిమాగా వచ్చే అవకాశం కనిపిస్తోంది. -
గుండెపోటు వల్లే ఆస్ట్రేలియా మహిళ మృతి
హైదరాబాద్: ఆస్ట్రేలియా మహిళ మార్గరెట్ లిండా(53) గుండెపోటు వల్లే చనిపోయినట్టు ఉస్మానియా వైద్యులు ధ్రువీకరించారని గోల్కొండ ఇన్స్పెక్టర్ ఖలీల్‌పాషా శుక్రవారం తెలిపారు. చెన్నైలోని ఆస్ట్రేలియా కాన్సులేట్ కార్యాలయం అధికారుల సూచన మేరకు మార్గరెట్ లిండా మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించామన్నారు. టూరిస్ట్ వీసాపై భారత్ వచ్చిన లిండా నైజీరియాకు చెందిన అల్బర్టో కోరర్(38)తో కలసి అక్బర్పురాలో ఓ అపార్ట్మెంట్లోని పెంట్‌హౌస్‌లో సహజీవనం చేస్తోంది. ఆస్తమా వ్యాధిగ్రస్తురాలైన లిండా గురువారం తాను ఉంటున్న ఫ్లాట్‌లోనే మృతి చెందిన సంగతి తెలిసిందే. -
'క్రిస్ గేల్ నన్ను లైంగికంగా వేధించాడు'
ఇప్పటికే పీకల్లోతు వివాదాల్లో కూరుకుపోయిన వెస్టిండిస్ క్రికెటర్ క్రిస్ గేల్‌కు మరో షాక్ ఎదురైంది. ఆయన తనను లైంగికంగా వేధించాడంటూ ఓ ఆస్ట్రేలియా మహిళ వెల్లడించింది. 2015 వరల్డ్ కప్ సమయంలో వెస్టిండిస్ జట్టుతో కలిసి పనిచేస్తున్న తన పట్ల గేల్ చాలా అభ్యంతరకరంగా వ్యవహరించాడని ఆమె చెప్పింది. 'శాండ్విచ్ తీసుకొనేందుకు నేను టీమ్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాను. అక్కడ నాకు గేల్ ఎదురయ్యాడు. అతను టవల్ మాత్రమే కట్టుకొని ఉన్నాడు. వెంటనే అతను టవల్ కూడా తీసేసి.. అభ్యంతరకరంగా మాట్లాడాడు. అతన్ని చూసి షాక్ తిన్నాను. మరుక్షణంలో అక్కడి నుంచి బయటకు వచ్చేశాను' అని ఆమె ఫెయిర్‌ఫాక్స్ మీడియా సంస్థకు తన అనుభవాన్ని వివరించింది. ఈ ఘటన గురించి వెస్టిండిస్ జట్టు మేనేజర్, మాజీ కెప్టెన్ రిచీ రిచర్డ్సన్కు వివరించగా.. మహిళా సిబ్బందితో ఆటగాళ్లు గౌరవప్రదంగా వ్యవహరించాలంటూ సర్క్యులర్ జారీచేశారని, కానీ అందులో గేల్ పేరు ప్రస్తావించలేదని ఆమె తెలిపారు. గేల్ ఇప్పటికే ఓ క్రికెట్ ప్రజెంటర్‌తో అసభ్యంగా మాట్లాడి పీకల్లోతు వివాదాల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. మహిళా ప్రజెంటర్ అయిన మెల్ మెక్‌లాలిన్‌ను తాగడానికి నాతో పాటు వస్తావా అంటూ గేల్ అంటూ ప్రత్యక్ష ప్రసారంలో అడగడం తీవ్ర దుమారం సృష్టిస్తోంది. -
ఫేస్ బుక్ సెల్ఫీ ఎంత పనిచేసింది!
మెల్ బోర్న్: గుర్రపు పందెంలో గెల్చుకున్న సొమ్మును 'ఫేస్ బుక్'లో పోగొట్టుకుంది ఓ ఆస్ట్రేలియా మహిళ. ఎఫ్ బీలో పోస్టు చేసిన సెల్ఫీయే ఆమె డబ్బు పోవడానికి కారణమైంది. అదేలాగంటే... చాంటెలె అనే మహిళ పెర్త్ అస్కట్ రేసుకోర్స్ లో మెల్న్ బోర్న్ కప్ పోటీలను వీక్షిస్తూ ప్రిన్స్ పెనజాన్స్ అనే గుర్రంపై 20 డాలర్లు పందెం కాసింది. రేసులో గెలవడంతో ఆమెకు 825 డాలర్లు వచ్చాయి. ఆనందంతో రేసు టికెట్ తో సెల్ఫీ దిగి ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. 'విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్' అంటూ సెల్ఫీకి క్యాప్షన్ కూడా పెట్టింది. 15 నిమిషాల తర్వాత పందెంలో గెలిచిన సొమ్ము కోసం నిర్వాహకులను సంప్రదించింది. అప్పటికే ఎవరో నగదు తీసుకెళ్లిపోయారని చెప్పడంతో చాంటెలె మొదట అవాక్కయింది. తర్వాత రియలైజ్ అయింది. ఫేస్ బుక్ లో తాను పోస్ట్ చేసిన సెల్ఫీలోని టికెట్ పై ఉన్న బార్ కోడ్ ను కత్తిరించి సొమ్ముకు తీసుకున్నారని తెలుసుకుంది. తన ఫేస్ బుక్ ఫ్రెండ్స్ ఎవరో ఈ పని చేసివుంటారని చాంటెలె పేర్కొంది. 'నా ఫోటోతో రేసులో గెలిచిన మొత్తాన్ని తెలివిగా కాజేశారు. నా ఫేస్ బుక్ లోని స్నేహితులే ఈ పని చేశారని నాకు తెలుసు. ప్రైజ్ మనీతో ఈ రోజు ఎంతో ఆనందంగా గడుపుదామనుకున్న నా ఆశపై నీళ్లు చల్లారు' అని చాంటెల్ తన ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేసింది. -
ఆస్పత్రిపాలు చేసిన టైట్ జీన్స్
అడిలైడ్: 'నీ జీనూ ఫ్యాంట్ చూసి బుల్లెమ్మా..' అంటూ తెలుగు సినిమాలో హీరో హీరోయిన్‌పై మనసు పారేసుకోవడం బాగానే ఉంది కానీ.. ఓ యువతికి మాత్రం ఫ్యాషన్‌పై ఉన్న మోజే ఆమె ప్రాణం మీదకు తీసుకొచ్చింది. ఇష్టపడి వేసుకున్న టైట్ జీన్స్ ఫ్యాంటే ఆమెను ఆస్పత్రి పాలుజేసింది. ఆ యువతి నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది. ఆస్ట్రేలియాకు చెందిన 35 ఏళ్ల యువతి టైట్ జీన్స్ ధరించడంతో తొడ కండరాలకు రక్తం సరఫరా కాకుండా గట్టిగా అతుక్కుపోయింది. ఇంటి పనిలో సాయం చేసిన ఆమెకు రానురాను నడవడం అసౌకర్యంగా అనిపించింది. కాళ్లలో శక్తి లేకుండా పోయింది. పాదాలు చచ్చుబడిపోయినట్టుగా అనిపించి కుప్పకూలిపోయింది. అడిలైడ్‌కు చెందిన ఈ యువతిని హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి సిబ్బంది ఆమె జీన్స్ ఫ్యాంట్‌ను కట్ చేసి వైద్యం అందించారు. బాగా నీరసించి పోయిన బాధితురాలు నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది. ఫ్యాషన్‌పై మోజు వల్ల బాధితురాలిగా మారింది. -
'తల్లి రాక్షసి'పై పోలీసుల కేసు నమోదు
కాన్బెర్రా: కన్న బిడ్డలను అత్యంత కిరాతకంగా హత్య చేసిన మహిళ మెర్సెన్ వారియా (37) పై కేసు నమోదు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి జిమ్ మాంటెగ్యు ఆదివారం వెల్లడించారు. ఈ హత్యలన్నీ ఆమె చేసిందని తాము ధృవీకరించినట్లు చెప్పారు. ఈ కేసును సోమవారం కెయిర్న్స్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు. ప్రస్తుతం నిందితురాలు మెర్సెన్... ఆసుపత్రిలో కోలుకుంటుందని పేర్కొన్నారు. అంతకు మించి సమాచారం మాత్రం తాను ఇవ్వలేనని మాంటెగ్యు స్పష్టం చేశారు. కెయిర్న్స్ పట్టణానికి చెందిన మెర్సెన్ వారియా తన ఏడుగురు చిన్నారులతోపాటు మేనకోడలైన మరో చిన్నారినీ శుక్రవారం హత్య చేసింది. అంతేకాకుండా ఆమెకు ఛాతీ, మెడపైనా గాయాలు ఉన్నాయి. వారియాకు ఐదుగురు భర్తలు ఉన్నారు. వారి ద్వారా ఈ మృతి చెందిన ఏడుగురు పిల్లలు జన్మించారు. పిల్లల మృతి వారి తండ్రులకు సమాచారం అందిస్తున్నామని చెప్పారు. చనిపోయిన వారంతా ఏడాదిన్నర నుంచి 14 ఏళ్లలోపు వారేనన్న విషయం తెలిసిందే. ఈ హత్యాకాండను మెర్సెన్ శుక్రవారం చేసిందని పోలీసులు భావిస్తున్నారు. మెర్సెన్ ను శనివారమే పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
టోని నిందితులు... పెనుకొండ జైలుకు తరలింపు
అనంతపురం: పుట్టపర్తిలో విదేశీ మహిళ హత్య కేసులో అపార్ట్మెంట్ వాచ్మెన్ భగవంతప్ప కీలక నిందితుడని అనంతపురం జిల్లా పోలీసులు ఆదివారం వెల్లడించారు. భగవంతప్పతోపాటు అతడి స్నేహితుడు పోతులయ్య నాగరాజును అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితులను పెనుకొండ జైలుకు తరలించినట్లు చెప్పారు. ఆస్ట్రేలియన్ మహిళ టోని అస్థిపంజరం నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం డీఎన్ఏ, ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. పుట్టపర్తిలోని సాయి గౌరి అపార్ట్మెంట్లో నివసిస్తున్న ఆస్ట్రేలియా మహిళ టోని దారుణ హత్యకు గురైంది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా అపార్ట్మెంట్ వాచ్మెన్ భగవంతప్పే కీలక నిందితుడిగా పోలీసులు నిర్థారించారు. -
ఆస్ట్రేలియన్ మహిళ అస్థిపంజరం వెలికితీత
-
ఆస్ట్రేలియన్ మహిళ అస్థిపంజరం వెలికితీత
అనంతపురం : పుట్టపర్తిలో హత్యకు గురైన ఆస్ట్రేలియన్ మహిళ టోనీ అన్నేల్ గేట్ మృతదేహానికి శవ పరీక్ష పూర్తియింది. టోనీ అస్తిపంజరం నుంచి బంగారు చైన్‌తో పాటు రెండు ఉంగరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పుట్టపర్తి డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ మృతదేహానికి డీఎన్ఏతో పాటు ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. పరీక్షల కోసం శాంపిల్స్ సేకరించారు. వాటిని బెంగళూరుకు పంపించనున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా సత్యసాయి భక్తురాలైన టోనీ అన్నెల్ గేట్ ఈ ఏడాది జూలై 23న పుట్టపర్తికి వచ్చింది. అప్పటి నుంచి ఆగస్ట్ 14 వరకు ప్రశాంతి నిలయంలోని మిత్రురాలి ఇంటిలో గడిపింది. ఆగస్ట్ 15 నుండి వివేకానందనగర్‌లో సాయిగౌరీ అపార్ట్మెంట్లోని 304 నంబర్ గదిలో నివసిస్తోంది. ఆగస్టు 28న వస్తువుల కొనుగోలు విషయమై బెంగళూరు వెళ్తున్నానని తన మిత్రురాలు సుట్టర్కు సమాచారం ఇచ్చింది. ఆ మరుసటి రోజు నుండి టోనీ కనిపించలేదు. అనుమానం వచ్చిన సుట్టర్ అక్టోబర్ 12వ తేదీన పుట్టపర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు విచారణలో అసలు విషయం బయటపడింది. సాయిగౌరీ అపార్ట్మెంట్ వాచ్మెన్, మరొకరితో కలిసి టోనీని డబ్బుకోసం హతమార్చారు. -
డబ్బు కోసమే ఆస్ట్రేలియా మహిళ హత్య
అనంతపురం: పుట్టపర్తిలో దారుణ హత్యకు గురైన ఆస్ట్రేలియా మహిళ టోనీ బేయిర్ కేసును అనంతపురం జిల్లా పోలీసులు ఛేదించారు. శనివారం అనంతపురంలో జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... బేయిర్ హత్య కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు శనివారం అనంతపురంలో వెల్లడించారు. కేవలం డబ్బు కోసమే వారు ఆమెను హత్య చేశారని తెలిపారు. నిందితుల వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పుట్టపర్తిలోని అన్ని ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. అలాగే పట్టణంలోని అన్ని అపార్ట్మెంట్లు, దుకాణాలలో సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని ఆయన పుట్టపర్తి వాసులకు సూచించారు. పుట్టపర్తికి వచ్చే విదేశీయులకు అన్ని విధాల భద్రత కల్పిస్తామన్నారు. అందుకోసం అవసరమైతే సత్యసాయి ట్రస్ట్ సహకారం కూడా తీసుకుంటామన్నారు. ఎక్కడ బస చేస్తున్నారో ముందుగా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఈ సందర్బంగా విదేశీయులకు ఎస్పీ రాజశేఖరబాబు విజ్ఞప్తి చేశారు. -
పుట్టపర్తిలో విదేశి మహిళ అదృశ్యం
-
పుట్టపర్తిలో విదేశీ మహిళ అదృశ్యం!
అనంతపురం : అనంతపురం జిల్లా పుట్టపర్తిలో విదేశీ మహిళ అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఆస్ట్రేలియకు చెందిన టోని అన్నేగేట్ గత కొంతకాలంగా పుట్టపర్తిలోని సాయి అపార్ట్మెంట్లో నివాసముంటుంది. అయితే సెప్టెంబర్ 15వ తేదీ నుంచి టోనీ కనిపించకుండా పోవడంతో ఆమె స్నేహితురాలు గ్రైట్ డీ సుట్టర్ 20 రోజుల క్రితం పుట్టపర్తి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు బెంగళూరు, కేరళలోని పర్యాటక ప్రాంతాల్లో టోనీ ఆచూకీ కోసం గాలించారు. అలాగే పుట్టపర్తి వివేకానందనగర్‌లోని సాయిగౌరీ అపార్టుమెంట్‌లోని టోనీ గదిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆమె నివాసం ఉంటున్న సాయిగౌరీ అపార్టుమెంట్ వాచ్మెన్... టోనీని హత్య చేసి పూడ్చిపెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వాచ్‌మెన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. కాగా టోనీ హత్య విషయాన్ని పోలీసులు ధృవీకరించడం లేదు. త్వరలోనే టోనీ అదృశ్యానికి సంబంధించిన వివరాలు వెలువడే అవకాశం ఉంది. -
సాహస నారీ