అనంతపురం: పుట్టపర్తిలో విదేశీ మహిళ హత్య కేసులో అపార్ట్మెంట్ వాచ్మెన్ భగవంతప్ప కీలక నిందితుడని అనంతపురం జిల్లా పోలీసులు ఆదివారం వెల్లడించారు. భగవంతప్పతోపాటు అతడి స్నేహితుడు పోతులయ్య నాగరాజును అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితులను పెనుకొండ జైలుకు తరలించినట్లు చెప్పారు.
ఆస్ట్రేలియన్ మహిళ టోని అస్థిపంజరం నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం డీఎన్ఏ, ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్లు తెలిపారు. పుట్టపర్తిలోని సాయి గౌరి అపార్ట్మెంట్లో నివసిస్తున్న ఆస్ట్రేలియా మహిళ టోని దారుణ హత్యకు గురైంది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా అపార్ట్మెంట్ వాచ్మెన్ భగవంతప్పే కీలక నిందితుడిగా పోలీసులు నిర్థారించారు.