
గుండెపోటు వల్లే ఆస్ట్రేలియా మహిళ మృతి
హైదరాబాద్: ఆస్ట్రేలియా మహిళ మార్గరెట్ లిండా(53) గుండెపోటు వల్లే చనిపోయినట్టు ఉస్మానియా వైద్యులు ధ్రువీకరించారని గోల్కొండ ఇన్‌స్పెక్టర్ ఖలీల్‌పాషా శుక్రవారం తెలిపారు. చెన్నైలోని ఆస్ట్రేలియా కాన్సులేట్ కార్యాలయం అధికారుల సూచన మేరకు మార్గరెట్ లిండా మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించామన్నారు. టూరిస్ట్ వీసాపై భారత్ వచ్చిన లిండా నైజీరియాకు చెందిన అల్బర్టో కోరర్(38)తో కలసి అక్బర్‌పురాలో ఓ అపార్ట్‌మెంట్‌లోని పెంట్‌హౌస్‌లో సహజీవనం చేస్తోంది. ఆస్తమా వ్యాధిగ్రస్తురాలైన లిండా గురువారం తాను ఉంటున్న ఫ్లాట్‌లోనే మృతి చెందిన సంగతి తెలిసిందే.