ఆస్పత్రిపాలు చేసిన టైట్ జీన్స్
అడిలైడ్: 'నీ జీనూ ఫ్యాంట్ చూసి బుల్లెమ్మా..' అంటూ తెలుగు సినిమాలో హీరో హీరోయిన్పై మనసు పారేసుకోవడం బాగానే ఉంది కానీ.. ఓ యువతికి మాత్రం ఫ్యాషన్పై ఉన్న మోజే ఆమె ప్రాణం మీదకు తీసుకొచ్చింది. ఇష్టపడి వేసుకున్న టైట్ జీన్స్ ఫ్యాంటే ఆమెను ఆస్పత్రి పాలుజేసింది. ఆ యువతి నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది.
ఆస్ట్రేలియాకు చెందిన 35 ఏళ్ల యువతి టైట్ జీన్స్ ధరించడంతో తొడ కండరాలకు రక్తం సరఫరా కాకుండా గట్టిగా అతుక్కుపోయింది. ఇంటి పనిలో సాయం చేసిన ఆమెకు రానురాను నడవడం అసౌకర్యంగా అనిపించింది. కాళ్లలో శక్తి లేకుండా పోయింది. పాదాలు చచ్చుబడిపోయినట్టుగా అనిపించి కుప్పకూలిపోయింది. అడిలైడ్కు చెందిన ఈ యువతిని హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి సిబ్బంది ఆమె జీన్స్ ఫ్యాంట్ను కట్ చేసి వైద్యం అందించారు. బాగా నీరసించి పోయిన బాధితురాలు నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది. ఫ్యాషన్పై మోజు వల్ల బాధితురాలిగా మారింది.