హత్యలకు కుట్ర పన్నిన 11 మంది అరెస్ట్ | 11 members in Murder gang arrested in anantapur | Sakshi
Sakshi News home page

హత్యలకు కుట్ర పన్నిన 11 మంది అరెస్ట్

Published Sat, Jun 27 2015 12:29 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

హత్యలకు కుట్ర పన్నిన 11 మంది అరెస్ట్ - Sakshi

హత్యలకు కుట్ర పన్నిన 11 మంది అరెస్ట్

అనంతపురం: పలువురి హత్యకు కుట్ర పన్నిన ముఠాగుట్టును శనివారం అనంతపురం సీసీఎస్ పోలీసులు రట్టు చేశారు. అందుకు సంబంధించి 11మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి తపంచా, ఆరు వేటకొడవళ్లతోపాటు భారీగా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించారు. ఆ తర్వాత జిల్లా ఏఎస్పీ మాల్యాద్రి నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. కేసు వివరాలను మాల్యాద్రి వివరించారు.

అరెస్ట్ చేసిన నిందితులు చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో మొత్తం నలుగురిని హత్య చేసేందుకు పథక రచన చేశారన్నారు. పుట్టపర్తి ఎంపీపీ శ్రీరామ్రెడ్డి, కౌన్సిలర్ శ్రీరాములతోపాటు చంద్ర అనే వ్యక్తిని... అలాగే  చిత్తూరు జిల్లా మదనపల్లెలోని ఓ కళాశాల యజమానిని కూడా హత్య చేసేందుకు వారంత కుట్రపన్నారని మాల్యాద్రి చెప్పారు. అరెస్ట్ అయిన వారిలో కదిరి పట్టణానికి చెందిన రౌడిషీటర్ నారాయణ నాయక్ కూడా ఉన్నారని తెలిపారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాల విలువ రూ. 3 కోట్ల వరకు ఉంటాయని పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement