మరో ఇరవై ఏళ్లు నాకేం పర్వాలేదు | Will remain healthy for 20 years more: Dalai Lama on 80th birthday | Sakshi
Sakshi News home page

మరో ఇరవై ఏళ్లు నాకేం పర్వాలేదు

Published Sun, Jun 21 2015 8:12 PM | Last Updated on Sun, Sep 3 2017 4:08 AM

మరో ఇరవై ఏళ్లు నాకేం పర్వాలేదు

మరో ఇరవై ఏళ్లు నాకేం పర్వాలేదు

ధర్మశాల: మరో ఇరవై ఏళ్లపాటు చక్కటి ఆరోగ్యంతో ఉంటానని టిబెటన్ ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలైలామా అన్నారు. ప్రస్తుతం 80 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన 20 ఏళ్లు ఆరోగ్యంగా ఉంటానని, వైద్యులు కూడా తనను పరీక్షించి ఇదే విషయం చెప్పారని తెలిపారు. తన అనంతరం ప్రస్తుతం తాను ఉంటున్న హోదాకు ఎవరు వస్తారనే విషయంలో ఇప్పుడప్పుడే ఎలాంటి చింత లేదని ఆయన స్పష్టం చేశారు.

తనకు 90 ఏళ్లు వచ్చే సమయానికి తాను తన హోదాలో ఉండొచ్చా లేదా అనే విషయాన్ని ప్రకటిస్తానని తెలియజేశారు. 'నేనొక సాధారణ బౌద్ధ సన్యాసిని మాత్రమే. అన్ని వేళలా మంచిచేయాలనే ప్రయత్నిస్తుంటాను. ఇప్పుడు నాకు ఎనభై ఏళ్లు. జీవితాంతం జ్ఞాన సముపార్జనకోసమే ప్రయత్నించాను. అలాగే ఇక ముందు కూడా ఉంటుంది' అని దలైలామా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement