
న్యూఢిల్లీ: అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ తన పేరును మార్చుకుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్‌గా ఈ నెల 27వ తేదీ నుంచి పేరు అమల్లోకి వచ్చినట్టు అదానీ ట్రాన్స్‌మిషన్ ప్రకటించింది. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, అహ్మదాబాద్ శాఖ నుంచి పేరు మార్పునకు సంబంధించిన సర్టిఫికెట్ ఆఫ్ ఇన్‌కార్పొరేషన్ అందుకున్నట్టు తెలిపింది. పేరు మార్పునకు సంబంధించి అవసరమైన పత్రాలను కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించింది.
అదానీ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ దేశంలోనే అతిపెద్ద విద్యుత్ సరఫరా కంపెనీగా ఉంది. 14 రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ముంబై, ముంద్రా సెజ్‌లలో 12 మిలియన్లకుపైగా వినియోగదారులకు సేవలు అందిస్తోంది. జూన్‌లో ముగిసిన మొదటి త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను ఆమోదించడానికి, ప్రకటించడానికి కంపెనీ బోర్డు సమావేశం జూలై 31న జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment