ఇక నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డి In the latest development, the Andhra Pradesh Government Gazette officially recognized his new name, Padmanabha Reddy. Sakshi
Sakshi News home page

ఇక నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డి.. గెజిట్‌ విడుదల

Published Thu, Jun 20 2024 9:20 AM | Last Updated on Thu, Jun 20 2024 12:15 PM

Mudragada Padmanabham Name Changed Padmanabha Reddy

అమరావతి/కాకినాడ, సాక్షి: అన్న మాట ప్రకారం పేరు  కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మార్చుకున్నారు. ఇక నుంచి ఆయన పేరు అధికారికంగా ముద్రగడ పద్మనాభ రెడ్డి.  ఈమేరకు AP Gazette లో ప్రచురణ కూడా అయ్యింది.

అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్‌ కల్యాణ్‌ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం ప్రచార సమయంలో సవాల్‌ విసిరారు. అయితే.. ఎన్నికల్లో పవన్‌ నెగ్గడం, ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చిన ముద్రగడ తన సవాల్‌కు కట్టుబడి ఉంటానని ప్రకటించడమూ తెలిసిందే. తాజాగా.. ఆయన పేరు మారింది. ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఈ మేరకు గెజిట్‌ విడుదలైంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement