
న్యూఢిల్లీ: ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరు ‘ఛత్రపతి శివాజీ మహరాజ్’ అంతర్జాతీయ విమానాశ్రయంగా మారనున్నట్లు సమాచారం. పేరు మార్పుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనున్నట్లు అధికారులు తెలిపారు.. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు మహారాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలియజేశారు. ముంబై విమానాశ్రయం పేరు మార్పు కోసం ఎన్నో ఏళ్ల నుంచి వినిపిస్తోన్న డిమాండు ఎట్టకేలకు కార్యరూపం దాల్చిందని అన్నారు. ముంబై ఎయిర్‌పోర్టును తొలుత సహారా ఇంటర్నేషనల్ యిర్‌పోర్ట్ అని పిలిచేవారు. అయితే 1999లో మహారాజా ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌గా పేరు మార్చారు.