chhatrapati shivaji airport
-
విమానంలో స్టాండింగ్
ముంబై: బస్సు, రైల్లో ప్రయాణికులు నిలబడి ప్రయాణించడం చూస్తుంటాం. కానీ విచిత్రంలో విమానంలో ఓ వ్యక్తి నిలబడి వెళ్లేందుకు సిద్దపడ్డాడు. ఈ ఘటన ముంబై నుంచి వారణాసి వెళ్లే ఫ్లైట్‌లో మంగళవారం జరిగింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో ప్లైట్ టేకాఫ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నపుడు ఓ ప్రయాణికుడు నిలబడి ఉండటం చూసిన సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అతడిని దింపేశారు. ఆ ప్రయాణికుడు ఇండిగో ఉద్యోగి. సిబ్బంది ఎయిర్‌లైన్ టికెట్లను తగ్గించడంలో భాగంగా కలిగించే ప్రయోజనం స్టాఫ్ లీజర్ ట్రావెల్లో భాగంగా ప్రయాణిస్తున్నాడు. (సిబ్బందికి ఇలా ప్రయాణించే అవకాశం ఉంటుంది) టేకాఫ్‌కు ముందు తనిఖీ చేయగా.. ఇండిగో ఫ్లైట్‌లో రావాల్సిన ఓ ప్రయాణికుడు రాలేదనే సమాచారం వచ్చింది. ఆ సీటును స్టాండ్‌బైగా ఇండిగో ఉద్యోగికిచ్చారు. తీరా ఫ్లైట్‌లోకి వెళ్లాక చూస్తే ప్రయాణికుడు ఉన్నాడు. దీంతో ఉద్యోగి నిలబడ్డాడు. అది సిబ్బంది గుర్తించి, నిలిపివేయడంతో టేకాఫ్ ఆలస్యమైంది. అది బోర్డింగ్ ప్రాసెస్ తప్పిదంగా గుర్తించారు. -
ప్రముఖ ఎయిర్‌పోర్టు పేరు మార్పు
న్యూఢిల్లీ: ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరు ‘ఛత్రపతి శివాజీ మహరాజ్’ అంతర్జాతీయ విమానాశ్రయంగా మారనున్నట్లు సమాచారం. పేరు మార్పుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనున్నట్లు అధికారులు తెలిపారు.. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు మహారాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలియజేశారు. ముంబై విమానాశ్రయం పేరు మార్పు కోసం ఎన్నో ఏళ్ల నుంచి వినిపిస్తోన్న డిమాండు ఎట్టకేలకు కార్యరూపం దాల్చిందని అన్నారు. ముంబై ఎయిర్‌పోర్టును తొలుత సహారా ఇంటర్నేషనల్ యిర్‌పోర్ట్ అని పిలిచేవారు. అయితే 1999లో మహారాజా ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌గా పేరు మార్చారు. -
ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్టుకి మరింత భద్రత
సాక్షి, ముంబై: ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయనున్నారు. పరిసర ప్రజలు విమానాశ్రయంలోకి రాకుండా నిలువరించడంతో పాటు కొత్తగా టెర్మినల్-2 వద్ద భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచనున్నామని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఎయిర్ పోర్ట్ ఆవరణలోని వివిధ చోట్ల అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నైట్ విజన్ కెమెరాలను కూడా అమర్చనున్నామని వివరించారు. ఈ కెమెరాలు కొన్ని సెకన్ల కాల వ్యవధిలోనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం చేరవేస్తాయన్నారు. దీనివల్ల విమానాశ్రయంలో ఏమి జరిగినా కనురెప్పపాటులో తెలిసిపోయే అవకాశమంటుందని వెల్లడించారు. ‘టీ2కు చెందిన జాయింట్ కో ఆర్డినేషన్ కంట్రోల్ (జేసీసీ) రూమ్‌ను మూడు భాగాలుగా విభజించారు. జి (గ్రౌండ్ స్టాఫ్), వి (ఫ్లైట్ ఆపరేషన్), కె.(సపోర్ట్ బృందం)గా విధులు నిర్వహణ ఉంటుంది. ఇందులో ఐటీ, కస్టమ్స్, సీఐఎస్ఎఫ్ సిబ్బంది విధులు నిర్వహిస్తార’ని తెలిపారు. కొత్త టెర్మినల్ మూడో అంతస్తులో ఏర్పాటుచేసిన జేసీసీలో ప్రస్తుతం 300 మంది సిబ్బంది ఉన్నారని, వీరి సంఖ్యను ఫిబ్రవరి 12వ తేదీ కల్లా పెంచుతామన్నారు. నూతన టెర్మినల్‌లో 1,600 భద్రత కోసం, 400 కెమెరాలు జేసీసీ కోసం కేటాయించామని వివరించారు. మున్ముందు టెర్మినల్‌ను మరింత అభివృద్ధి చేసినప్పుడు కెమెరాల సంఖ్యను కూడా పెంచుతామని చెప్పారు. ‘ ఇక్కడ ఏర్పాటుచేసే పెరిమీటర్ ఇంట్రషన్ అండ్ డిటెక్షన్ సిస్టమ్ (పీఐడీఎస్) భద్రతా వ్యవస్థ ‘టౌట్’ వైర్ టెక్నాలజీతో అనుసంధానమై ఉంటుంది. ఈ వైర్లను ఎయిర్పోర్ట్ ఆవరణలో ఫెన్సింగ్‌గా ఏర్పాటుచేస్తామ’ని తెలిపారు. ఈ వైర్లను ఎవరైనా తగిలితే తేలికపాటి షాక్ తగలడమేకాకుండా సూచనలు కూడా జారీ చేస్తుందని వెల్లడించారు.